
ఆ యువతి ఎర్నాకులం సౌత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా.. పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఆ యువతి తెలిపిన ప్రకారం దినిల్ బాబు తనతో వేఫేరర్ ఫిలిమ్స్ తరపున మాట్లాడుతున్నానంటూ చెప్పి తనకు ఒక కొత్త సినిమాలో అవకాశం ఇస్తానని నమ్మించారని కానీ ఆ తర్వాత అతని ప్రవర్తన చాలా దురుసుగా ఉండడమే కాకుండా, మాట్లాడుతూ లైంగిక వేధింపులు చేశారని ఆ యువతి పోలీసులకు వివరించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
అయితే ఈ వ్యవహారంపై వేఫేరర్ ఫిలిమ్స్ స్పందిస్తూ తమ అధికారిక ప్రకటనలో దీనిల్ బాబు తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని ఆయన సంస్ధ పేరు వినియోగించుకొని ఇలా చాలామందిని మోసం చేశారని తెలిసింది. ఇందుకు సంబంధించి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేశారు. అంతేకాకుండా మా సంస్థలో కాస్టింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగానే ఉంటుంది,ఎలాంటి విషయాలైనా సరే మా అధికారిక సోషల్ మీడియా, లేకపోతే కాల్స్, పేజీల ద్వారానే తాము ప్రకటిస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం పైన అటు సినీ ప్రేమికులు, అభిమానులు, నేటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.. దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరో లాంటి సంస్థకే ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధాకరమంటూ కామెంట్స్ చేస్తున్నారు.