దీప దీపావళి పండగ అంటే చిన్న పెద్ద ఇలా ప్రతి ఒక్కరికి ఇష్టం.అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దీపావళి రానే వచ్చింది.అక్టోబర్ 20, 21 రెండు తేదీలలో దీపావళి పండుగ జరుపుకోవచ్చని అంటున్నారు. అలా కొంతమంది సోమవారం పండగ అంటే మరి కొంతమంది మంగళవారం అంటున్నారు.అయితే పురోహితులు ఏ ప్రాంతంలో ఎలా చెబితే అదే రోజు పండగను జరుపుకుంటారు. ఇదిలా ఉంటే దీపావళి పండుగ అంటేనే లక్ష్మీదేవి పూజ.. దీపావళి రోజు అందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ఈ లక్ష్మీదేవి పూజ సమయంలో ఈ రంగు దుస్తులు ధరిస్తే ఖచ్చితంగా  ఇంట్లో ఆ సంవత్సరం అంతా డబ్బుకు కొదువ ఉండదు అని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు.మరి ఇంతకీ లక్ష్మీదేవి పూజలో ఏ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడు చూద్దాం. 

లక్ష్మీదేవి పూజలో పసుపు రంగు దుస్తులు ధరించి నిష్టగా ఆ తల్లిని పూజిస్తే ఖచ్చితంగా ఏడాది సంపదకు కొదువ ఉండదట.అలాగే లక్ష్మీదేవి కటాక్షం వారి మీద ఉంటుందట. అంతేకాకుండా తెలుపు రంగు దుస్తులను వేసుకొని కూడా లక్ష్మీదేవి పూజ చేయచ్చట. తెలుపు రంగు అంటే శాంతికి చిహ్నం కాబట్టి ఆ అమ్మవారి కటాక్షం కలుగుతుందని అంటున్నారు. ఇక ఎరుపు రంగు దుస్తుల్లో కూడా లక్ష్మీ పూజ చేయవచ్చని, ఎరుపు రంగు ధైర్యం,శక్తి,ప్రేమకి చిహ్నం అని.. ఈ రంగు దుస్తులు ధరించినా కూడా మంచి ఫలితం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

 కానీ దీపావళి పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు దుస్తులు, నీలం రంగు దుస్తులను వేసుకోకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి దుస్తులు వేసుకోవడం పూజ సమయంలో మంచిది కాదు అని,ఈ దుస్తుల కారణంగా అక్కడ నెగిటివ్ వైబ్స్ వస్తాయని అంటున్నారు.అందుకే దీపావళి రోజు నెగిటివ్ ఎనర్జీ ని తీసుకువచ్చే నలుపు రంగు, నీలం రంగు దుస్తులను పక్కనపెట్టి తెలుపు,ఎరుపు, పసుపు రంగు దుస్తులను ధరించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే దీపావళి రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి దేవుడిని పూలతో పూజించి ఇంట్లో దీపాలు పెట్టుకొని ఉంటేనే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: