టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు ఆ హీరోయిన్ పేరు చెపితేనే భయపడిపోతున్నారట. ఇదేదో కాస్త ఓవర్ అనుకోవద్దు... ఇది పచ్చి నిజం. చూడడానికి అందమైన లావణ్య రాశిలా ఉన్న ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్గా పెట్టాలని స్టార్లు సైతం పట్టుబట్టి మరి ఆమెనే తమ సినిమాల్లో హీరోయిన్గా రికమెండ్ చేస్తున్నారు. కానీ ఆమె ట్రాక్ రికార్డు మాత్రం చాలా దారుణంగా ఉంటోంది. దీంతో ఇప్పుడు ఆమెను రికమెండ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం జంకాల్సిన పరిస్థితి.
ఆమె స్టార్ హీరోలతో వరుసపెట్టి నటిస్తున్నా ఆమె ఖాతాలో ఒక్క హిట్ సినిమా కూడా నమోదు కాలేదు. ఒక లైలా కోసం - ముకుంద - మొహంజుదారో - సాక్ష్యం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. డీజే కూడా బిలో యావరేజ్. ఇక అరవింద సమోత మాత్రం ఓ మోస్తరుగా ఆడింది. అటు కోలీవుడ్‌లోనూ ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాలేదు. ఇప్పటి వరకు పూజ ఖాతాలో ఉన్న ఏకైక సినిమా రంగస్థలం.
ఆ సినిమాలో కూడా ఆమె ఐటెమ్ సాంగ్ మాత్రమే చేసింది. ఆ హిట్ ఆమె ఖాతాలో వేయలేం. వరుస ప్లాపులతో టాలీవుడ్ ఇప్పటికే పూజకు ఐరెన్ లెగ్ బిరుదు ఇచ్చేసింది. ఇక తాజాగా ఆమె మహేష్‌తో చేసిన మహర్షి సినిమా సైతం అయితే యావరేజ్ మినహా హిట్ అయ్యే పరిస్థితి లేదు. అయినా ఆమె టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌తో, అల్లు అర్జున్‌తో చెరో ఒక సినిమా చేస్తోన్న పూజ ఆ సినిమాలతో అయినా సాలిడ్ హిట్ కొడితేనే ఆమెకు ఉన్న ముద్ర తొలిగిపోయేలా ఉంది.