గోపీచంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్గా నటించిన సినిమా 'చాణక్య'. తమిళ్ దర్శకుడు తీరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా
దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమాలో
జరీన్ ఖాన్ కీలక పాత్ర పోషించింది.
అయితే ఈ సినిమాను ఫస్ట్ అప్ చుసిన వాళ్ళు అంత సినిమా అద్భుతంగా ఉందని, ఫస్టాఫ్ అందరిని మెప్పించింది అని వారు ప్రేక్షకులు చెప్తున్నారు. విభిన్న కథనంతో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా అద్భుతంగా ఆకట్టుకుంటుంది అని సెకండ్ హాఫ్ కూడా బాగుంటే గోపి చంద్ కి హిట్ వచ్చినట్లే అని వారు పేర్కొంటున్నారు.
సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, చాలా బాగా తీశారని కొనియాడారు. స్పై థ్రిల్లర్‌లో ఒక వైవిధ్య కోణాన్ని ఎంపిక చేసుకుని చూపించారన్నారు. గోపీచంద్ లుక్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని పేర్కొన్నారు. స్పై పాత్రలో ఆయన చాలా బాగా నటించారని చెప్పారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న
గోపీచంద్ కి ఈ సినిమాతో అయినా హిట్ వస్తుంది ఏమో చూడాలి.