ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో ప్రతి రంగంలో సరికొత్త ఆవిష్కరణలు తెరమీదకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రతి పనిని మనుషులే పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు మనుషులతో అవసరం లేకుండా మెషిన్లే అన్ని పనులను పూర్తి చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే వైద్య రంగంలో కూడా ఇలాంటి అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ తో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టగలుగుతున్నారు వైద్యులు. దీంతో ఇక ప్రతి రోగానికి మందు కనిపెట్టడం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే..


 అయితే కొన్ని కొన్ని సార్లు వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త టెక్నాలజీని చూసి ప్రతి ఒక్కరు కూడా నోరెళ్ళ పెడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా టెక్నాలజీ గురించే. సాధారణంగా ఒక వ్యక్తికి సర్జరీ అవసరం ఉన్నప్పుడు.. విదేశాల్లో ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టర్ మాత్రమే ఆ సర్జరీ చేయగలిగినప్పుడు. ఇక ఆ డాక్టర్ వచ్చేంతవరకు ఆగాల్సిందే. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి సమయంలో ఇక పేషెంట్ ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టర్ పేషంట్ దగ్గరికి రాకుండా శస్త్ర చికిత్స చేయడం అసాధ్యం  అన్న విషయం అందరికీ తెలుసు.


 కానీ ఇప్పుడు ఇలా రావాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఎక్కడున్నా అక్కడి నుంచే సర్జరీ చేయవచ్చు. అది ఎలా కుదురుతుంది. అది ఏమైనా వీడియో గేమా.. అలా చేయడానికి అనుకుంటున్నారు కదా. కానీ వైద్యరంగంలో ఇటీవల మరో అద్భుతం జరిగింది. చైనాలో 5000 కిలోమీటర్ల దూరంలో లూనో క్వీన్ కాన్ అనే డాక్టర్ ఒక రోగికి శాస్త్ర చికిత్స చేసి ఊపిరితిత్తుల్లో కనితిని తొలగించాడు. షాంగై లోని తన ఆసుపత్రి నుంచి లూడో కిగ్ కాన్ 5000 కిలోమీటర్ల దూరంలోని కస్గర్లో ఉన్న పేషెంట్ కు 5జి సర్జికల్ రోబోట్ సిస్టం ద్వారా ఆపరేషన్ చేశాడు. గంటపాటు మెషిన్ ని ఆపరేట్ చేస్తూ ఇక సర్జరీని విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: