ఊరుకెళ్లాలంటే ఆర్టీసీ బస్సులో టికెట్ రిజర్వేషన్ చేసుకోవడం సాధారణమే. ఇందుకు ఆర్టీసీ వెబ్ సైట్‌ను ఆశ్రయిస్తాం.. అయితే ఇప్పుడు రెడ్ బస్ వంటి ప్రైవేటు యాప్‌లు వచ్చినా అన్ని ప్రాంతాలకూ సర్వీసుల అందిస్తున్న మాత్రం ఏపీఎస్ ఆర్టీసీనే. ఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకోవాలంటే.. ఆన్‌ లైన్‌లో ఆర్టీసీ వెబ్ సైట్‌కు వెళ్తాం.. అక్కడే బుక్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఓ చిన్న మార్పు జరిగింది. ఇది వినియోగదారులు తప్పక గమనించాల్సి ఉంటుంది.

అదేంటంటే.. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్‌ రిజర్వేషన్‌కు www.apsrtconline.in వెబ్ సైట్ అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఆర్టీసీ తన వెబ్ సైట్‌ ను నేటినుంచి www.apsrtconline.in బదులు www.apsrtconline.org.inగా మారుస్తోంది. అంటే ఇకపై  www.apsrtconline.in వెబ్ సైట్‌లో కాకుండా... www.apsrtconline.org.in వెబ్ సైట్‌లో బుక్ చేసుకోవాలన్నమాట. మార్పు ఏంటంటే వెబ్ సైట్ అడ్రస్‌లో .org యాడ్ చేశారు. బహుశా సాంకేతికపరమైన కారణాలతోఈ మార్పు చేసి ఉంటారు.

అయితే కొత్త వెబ్ సైట్ అందరికీ అలవాటయ్యేంత వరకూ రెండు వెబ్ సైట్లు అందుబాటులో ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత.. www.apsrtconline.in వెబ్ సైట్ కనుమరుగవుతుంది.  ఇక www.apsrtconline.in బదులు www.apsrtconline.org.inమాత్రమే కొన్ని రోజుల తర్వాత నుంచి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ టికెట్ రద్దు కోసం refunds.apsrtc@gmail.comకు వివరాలు పంపాలని ఆర్టీసీ చెబుతోంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే.. ఫిర్యాదుల కోసం 0866 2570005 నంబర్‌ సంప్రదించాలని ఆర్టీసీ చెబుతోంది.

ఏపీఎస్‌ఆర్టీసీకి సంబంధించి మరో అప్‌ డేట్ ఏంటంటే.. ఆర్టీసీ బస్సుల్లో  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు  గతంలో ఉన్న శీఘ్ర దర్శనాన్ని  పునరుద్దరించింది. దీని ప్రకారం.. పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వచ్చే ప్రయాణికులకు శీఘ్ర దర్శనం టికెట్లు జారీ చేస్తోంది టీటీడీ. ప్రయాణికులు చార్జి తో పాటు రూ. 300 చెల్లించి బస్సుల్లోనే శీఘ్ర దర్శనం టికెట్లు పొందే సదుపాయం కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులకు ప్రతి రోజూ వెయ్యి టికెట్ల చొప్పున జారీ చేయాలని నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: