నటిగా సినిమాల్లో విజయశాంతి కి మంచి పేరుంది. ఇటీవలే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటించి మళ్ళీ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందని చెప్పకనే చెప్పారు.. అయితే ఆమె ఆ పాత్ర బాగా ఉన్నందునే వచ్చానని పాత్ర బాగుంటే చేయడానికి రెడీ అని చెప్పారు.. ఇక రాజకీయంగా ఆమె ఇటీవలే బీజేపీ పార్టీ లో చేరారు.. బీజేపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విజయ శాంతి ఆ తర్వాత పలు పార్టీ లను టచ్ చేసి మళ్ళీ పుట్టింటికి చేరుకుంది. బీజేపీ నుంచి టీ ఆర్ ఎస్ లోకి, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లి అటునుంచి మళ్ళీ బీజేపీ లోకి చేరారు..