ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తో సహా బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వీరికి కేంద్రం కల్పిస్తున్న షనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రత ఉపసంహరణకు రంగం సిద్ధమైంది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్న అఖిలేశ్ కు ఎన్ఎస్జీ కమెండోలు గార్డులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దేశంలోని ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతపై ఇటీవల కేంద్ర హోం శాఖ సమీక్షించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అఖిలేశ్ కు ఎన్ఎస్జీ గార్డులతో భద్రత కల్పించాల్సిన అవసరం లేదని అధికారులు అభిప్రాయపడ్డారు. 



కాంగ్రెస్‌తో భాయ్ భాయ్‌గా మెలుగుతున్న డీఎంకే అధినేత కరుణానిధికి కేంద్రప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. అసెంబ్లీలో ఇదివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు బ్లాక్ కమెండోస్ భద్రతను ఉపసంహరించుకుంది. దేశంలోని అత్యంత ప్రముఖ నేతలకు కేంద్ర ప్రభుత్వం బ్లాక్ కమెండోస్ భదత్రను కల్పించడం  అనవాయితీగా వస్తోంది. ఇలాంటి భద్రతా చర్యల్లో నాలుగు కేటగిరిలు ఉన్నాయి. జెడ్ ప్లస్, జెడ్, వై, ఎక్స్ పేర్లతో నేతలకు భద్రత కల్పిస్తున్నారు.



ప్రధాని, మాజీ ప్రధానులకు, వారి కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తారు. ఇతరులకు అప్పటి పరిస్థితులను బట్టి జెడ్ ప్లస్ కేటాయిస్తారు. ప్రస్తుతం దేశంలో మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ వారి కుటుంబసభ్యులకు మరి కొంతమందితో కలుపుకుని మొత్తం 15 మంది నేతలకు బ్లాక్ కమెండోస్‌తో కూడిన జెడ్ ప్లస్ భద్రతను కల్పించారు. డీఎంకే అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా కరుణానిధికి బ్లాక్ కమెండోస్ భద్రత కల్పించారు. ఆ తరువాత ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ భద్రతా  కొనసాగుతోంది. కాగా, దేశంలోని పలువురు నేతలకు జెడ్‌ప్లస్ భద్రతను ఉపసంహరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా ఆ జాబితాలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరు చోటుచేసుకుంది. ఇదే అభిప్రాయంతో కూడిన నివేదికను ఆ సమావేశం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనుమతి కోసం పంపింది. దీనిపై రాజ్ నాథ్ సంతకం చేస్తే ఈ ముగ్గురికి ఎన్ఎస్జీ కమెండోల భద్రత ఉపసంహరిస్తారు. ఎన్ఎస్జీ కమెండోల స్థానంలో వారికి పారా మిలిటరీ బలగాలతో భద్రత కల్పిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: