త‌మిళ తెర‌పై వెలుగు వెలుగుతున్న స్టార్లు ఇప్పుడు రాజ‌కీయ తెర‌పైకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఒక‌రికి పోటీగా మరొక‌రు అడుగులు వేస్తున్నారు. ఒక‌రు స్లో అండ్ స్ట‌డీగా వ‌స్తుంటే.. మ‌రొక‌రు సూప‌ర్ ఫాస్ట్‌లా నిర్ణ‌యాలు తీసుకుంటు న్నారు. వీరి ఎంట్రీతోనే త‌మిళంలో రాజ‌కీయ హీట్ పెరిగిపోతుంటే.. ఇప్పుడు వీరికితోడు మ‌రో ఇద్ద‌రి పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు త‌మిళ రాజ‌కీయ తెర‌పై అగ్ర‌హీరోల నాలుగుస్తంభాలాట మొద‌ల‌వ‌బోతోంది! సినిమాల్లోనే గాక‌ న‌లుగురు అగ్ర‌హీరోలు బ‌య‌ట కూడా పోటీపడుతున్నారు. ముందు ఎవ‌రి సినిమా విడుద‌ల అవుతుందో తెలియ‌దు గాని.. త‌మిళ ప్ర‌జ‌లు మాత్రం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 

rajini kamal కోసం చిత్ర ఫలితం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, విశ్వ‌న‌టుడు క‌మ‌ల‌హాస‌న్‌.. ఇద్ద‌రి పేర్లు తమిళ రాజ‌కీయాల్లో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్ద‌రూ రేపోమాపో సొంత పార్టీల‌తో బ‌రిలోకి దిగ‌బోతున్నారు. ఇప్ప‌టికే వీరితో పొత్తు పెట్టుకునేందుకు మిగిలిన పార్టీల‌న్నీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటే.. తాజాగా మ‌రో ఇద్ద‌రు హీరోలు కూడా రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపైనా తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. వాళ్లే తలా అజిత్‌.. ఇళయదళపతి విజయ్‌! తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసుడిగా వార్తల్లోకెక్కాడు హీరో అజిత్‌. అన్నాడీఎంకే పార్టీకి జయలలిత తర్వాత సారధి ఆయ‌నేన‌ని చాలామంది భావించారు. కానీ అమ్మ‌ మరణానంతరం రాజకీయాలకు సంబంధించి పూర్తిగా స్తబ్దుగాగా వున్నాడు అజిత్‌. 

hero ajith కోసం చిత్ర ఫలితం

అయినాసరే, అన్నాడీఎంకే పార్టీకి సినీ గ్లామర్‌ అవసరమనుకుంటే మాత్రం అజిత్‌, రంగంలోకి దిగుతాడన్నది అభిమానుల వాదన. తాజాగా మెర్సల్‌ సినిమాతో రాజకీయ తెరపై హీరో విజయ్‌ పేరు మార్మోగిపోతోంది. రాజకీయ రంగ ప్రవేశానికి వీలుగా మెర్సల్‌ సినిమాలో వ్యూహాత్మకంగానే పొలిటికల్‌ డైలాగుల్ని విజయ్‌ పెట్టించాడంటూ తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురూ కాదు.. ఇంకా చాలామంది సినీ ప్రముఖులు తమిళ రాజకీయాల్లో సందడి చేసే అవకాశముంద‌ట‌. 2019 ఎన్నిక‌ల టైంకు త‌మిళ రాజ‌కీయాల్లో సినిమా హీరోల హంగామా ఓ రేంజ్‌లో ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.

hero vijay కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: