పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుంది..ఇప్పుడు ముక్కుమొహం తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి మహారాష్ట్రకు చెందిన కారు యజమాని నితిన్ నాయర్ రూ.1500 జరిమానా కట్టాల్సి వచ్చింది.  వర్షంలో తడుస్తున్న వ్యక్తులకు తన కారులో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.1,500 ఫైన్ వేయడంతో పాటు లైసెన్స్ లాక్కుని ఫైన్ కట్టి తీసుకెళ్లాలని ఆదేశించారు.

దీంతో ఆ వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి లబోదిబోమంటున్నాడు.  ముంబైకి చెందిన నితిన్ అయ్యర్ 18వ తేదీన ఐరోలి సర్కిల్ వద్ద వెళ్తుండగా భారీ వర్షం కురుస్తోంది. వర్షంలో రవాణా సదుపాయం లేక ముగ్గురు వ్యక్తులు తడుచుకుంటూ వెళుతున్నారు. ఇది చూసిన నితిన్ వారిని కార్లో ఎక్కుంచుకున్నారు. కొంత ముందుకు వెళ్లగానే ఓ ట్రాఫిక్ పోలీస్ ఎదురొచ్చి కారు ఆపాడు.  అజ్ఞత వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చినందుకు రూ.1,500 ఫైన్ రాశిచ్చాడు.

చలాన్ కట్టి తీసుకెళ్లాలని లైసెన్స్ తీసుకెళ్లాడు. అయినా నితిన్ ఆ ముగ్గురినీ వారి గమ్యస్థానాల్లో దింపాడు. మరుసటి రోజు వెళ్లి చలాన్ కట్టి లైసెన్స్ తెచ్చుకున్నాడు.  పాపం అని లిఫ్ట్ ఇచ్చినందుకు సెక్షన్ 66/192 ప్రకారం అజ్ఞత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరం. ఈ విషయం నితిన్ కి తెలియదు. నితిన్ కే కాదు చాలామందికి తెలిసుండదు. దీంతో తన చేదు అనుభవాన్ని నితిన్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చి తనలా ఇరుక్కోవద్దని సూచించాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: