ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఇది. పోటాపోటీ పరిస్థతి ఉన్నందువల్ల అందరిలోనూ టెన్షన్ రేపుతోంది. అందుకే ఏ సర్వే వచ్చినా అందరూ వాటివైపు ఆసక్తిగా చూస్తున్నారు. 

chandrababu angry కోసం చిత్ర ఫలితం


ఇలాంటి సమయంలో ఓ సర్వే తెలుగుదేశం శ్రేణుల్లో కలకలం రేపుతోందట. అది కూడా సర్వేల స్పెషలిస్ట్ అస్మదీయ నేతల కోసం చేసిన ఇంటర్నల్ సర్వే అని చెబుతున్నారు. ఇంతకీ ఆ సర్వేలో ఏం చెప్పారంటారా.. గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ఓటర్లు వైసీపీవైపే ఉన్నారట. 

tdp cadre కోసం చిత్ర ఫలితం

టీడీపీ- వైసీపీ మధ్య లెక్కల్లో తేడా చాలా విస్పష్టంగా కన్పిస్తోందట. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం ఫలితాలు అధికార పార్టీకి చేదు అనుభవాన్ని మిగల్చటం ఖాయం అని ఆ సర్వే కుండబద్దలు కొట్టిందట. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ చాలా చోట్ల ప్రతిపక్ష వైసీపీకి అనుకూల వాతావరణం ఉందని తేలిందట. 

సంబంధిత చిత్రం

గెలుపు అవకాశాలపై అనుమానంతోనే చంద్రబాబు ఎన్నికల ముందు పెన్షన్ పెంపు, అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ వంటి స్కీమ్ లను ఆగమేఘాల మీద అమలుపర్చారు. అయినా సరే వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా మారకపోవటం టీడీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకే వారిలో ఒకటే టెన్షన్ కనిపిస్తోందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: