వజ్రపుకొత్తురు మండలంలో అలలు ఉగ్రరూపం దాల్చి తీరానికి వస్తున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలను చూసి మస్త్యకారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని భావనపాడు, మంచినీళ్లపేట, బారువ తీరాలాలో దాదాపు 50 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. 


 అలల తాకిడికి వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో సముద్రం దాదాపు 135 మీటర్ల మేర ముందుకు వచ్చింది. అలల తాకిడికి ఈ మండడాలు కోతకు గురవుతున్నాయి. మంచినీళ్లపేటతో పాటు దేవునల్తాడ, డోకులపాడు, అక్కుపల్లి తీరంలో తీరం కోతకు గురైంది. అల్పపీడన  ద్రోణి, ఉపరితల ఆవర్తనం వెరసి కోస్తా తీరానికి భారీ వర్షం పొంచి ఉందని  భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

తీర ప్రాంతాల గ్రామాలలో మస్త్యకారులఅను వేటకు వెళ్లరాదంటూ దండోరాలు వేయించిన రెవిన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ సూచిస్తున్నారు. తీరంలోనే వేటసామాగ్రి వదిలిన మాస్త్యకారులు వేట లేక రెండురోజులుగా  ఇళ్లకే పరిమితమైయ్యారు. గతంలో ఎన్నడూలేని  విధంగా ఈ ఏడాది తీరం కోతకు గురవడం ఇది ఐదోసారి , గతంలో వచ్చిన తుఫాన్‌, అధిక వర్షాలకు ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉండేది కాదని మత్స్యకారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: