పీపీఏలు.. జగన్ సర్కారు టార్గెట్ చేసిన మరో అంశం ఇది.. పీపీఏలు అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కోట్ల అవినీతి జరిగిందని.. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారం పడుతోందని జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చెబుతున్నాడు. వాటిని సమీక్షించి రద్దు చేసే ఆలోచన ఉందని మొదటి నుంచి అంటూనే ఉన్నారు.


అయితే ఈ పీపీఏల రద్దు అంశాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే జగన్ ఈ విషయాన్ని ఏకంగా ప్రధాని మోడీ దృష్టికే తీసుకెళ్లారు. ప్రధాని ఆశీస్సులతోనే ఈ పీపీఏల సమీక్ష చేపడుతున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు కూడా. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని.. పీపీఏలు రద్దుచేయబోమని కేంద్రానికి లేఖ రాసిందని బుధవారం ఎల్లో మీడియా బ్రేకింగ్ న్యూస్ లు వేసి హడావిడి చేసింది.


దీంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. ప్రజల ప్రయోజనాల విషయంలో జగన్ ప్రభుత్వం ఒక్క మెట్టు ఎక్కడమే తప్ప దిగడం ఉండదని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. పీపీఏల విషయంలో ప్రాతిపదిక ప్రజాప్రయోజనాలేనని బాలినేని అన్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇప్పటికే 20వేల కోట్ల భారంతో కుంగి పోతున్నాయని... రాష్ట్రంలో విద్యత్‌ రంగం బతికి బట్టకటాలంటే ప్రక్షాళన తప్పనిసరని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.


ప్రస్తు పరిస్థితితో ముందుకు వెళ్తే విద్యుత్‌ ఉత్పాదన కంపెనీలకు ఛార్జీలు కూడా చెల్లించని పరిస్థితి ఉంటుందని మంత్రి బాలినేని అంటున్నారు.. ఇప్పటికే ఉత్పత్తికంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. విద్యుత్‌ రంగం పునరుజ్జీవం కోసం ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని.. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో ఒప్పందాలు కుదర్చుకుని ప్రజల ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.


నిబంధనలకు విరుద్ధంగా చేసుకున్న ఒప్పందాలను, వాస్తవ ధరలకన్నా ఎక్కువ ధరలకు కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పకుండా సమీక్షిస్తామని మంత్రి బాలినేని తెలిపారు. గత ప్రభుత్వం తప్పులను సరిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని పీపీఏ ల అంశంపై ముందుకేగాని, వెనక్కి ఉండదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. దీంతో పీపీఏల విషయంలో వైసీపీ సర్కారు లేఖరాసిందంటూ ఎల్లో మీడియాలో జరిగిన ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: