హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ఎంత మంచివాడ‌వురా. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాత‌లు. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకులు. `శ‌త‌మానం భ‌వ‌తి`తో జాతీయ పుర‌స్కారం అందుకున్న స‌తీష్ వేగేశ్న ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.


ఈ సినిమా ప్రస్తుతం రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో భారీ ఎత్తున షూటింగ్ జ‌రుపుకొంటోంది. అయితే ఈ సినిమాకు `ఎంత మంచివాడ‌వురా` అనే టైటిల్ పెట్టడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజుల్లో హీరో అంటే ఎలా ఉండాలి.. పోకిరిగా,అల్లరిగా చిల్లరగా ఉండాలి. సినిమా పేర్లు సైతం పోకిరిగానే కనిపించాలి.ఇడియర్, రాస్కెల్, గద్దలకొండ గణేశ్ ఇలా రఫ్ గా ఉండాలి, అలా ఉంటేనే మాస్ కు కనెక్టయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ.. ఈ సినిమా టైటిల్ మాత్రం ఎంత మంచి వాడవురా.. అని ఉండటం ఎలాంటి ఫలితాలిస్తుందన్నది చూడాలి.


ఇందులో మెహ‌రీన్‌ క‌థానాయిక‌. చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఉమేష్ గుప్తా, చిత్ర స‌మ‌ర్పకులు శివ‌లెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వ‌స్తోంది. ఆగ‌స్టు 26 నుంచి రాజ‌మండ్రి, పెండ్యాల‌, పురుషోత్తమ‌ప‌ట్నం, వంగ‌ల‌పూడి, తొర్రేడు, కొవ్వూరు, కోటిప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నామంటోంది.

ఏక‌ధాటిగా జ‌రుగుతున్న ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగ‌ణం అంతా పాల్గొంటున్నారు. అలాగే పెండ్యాల‌లోని ఇసుక ర్యాంప‌ల మ‌ధ్య భారీ ఎత్తున తెర‌కెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుంది. వంగ‌ల‌పూడి స‌మీపంలో గోదావ‌రిలో 16 బోట్ల‌తో తెర‌కెక్కించిన ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క్లైమాక్స్ అల్టిమేట్‌గా ఉంటుంది. జ‌న‌వ‌రి 15న సంక్రాంతి కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేస్తాం అంటున్నారు నిర్మాతలు .


నాలుగ‌వ షెడ్యూల్లో కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో కొన్ని ప్రధాన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. క‌ల్యాణ్‌రామ్‌గారి చిత్రాల్లో భారీ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: