రాజకీయాల్లో వారసులు రావడం సహజం. తమ తండ్రుల మద్ధతుతో వారసులు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారు. అయితే తండ్రులు సక్సెస్ అయినట్లు వారసులు కూడా రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే కష్టపడతారు. కానీ కష్టపడకుండా అందలం ఎక్కాలని చూస్తే... ప్రజలు వారిని వెంటనే దించేస్తారు. సరిగా ఇదే పరిస్తితి చంద్రబాబు వారసుడు నారా లోకేశ్‌కు ఎదురైంది. ఎలాంటి కష్టం లేకుండానే లోకేశ్ ఎమ్మెల్సీ, మంత్రి కూడా అయిపోయారు. అయితే ఆ పదవులని సక్సెస్‌గా నడిపించలేకపోవడంతో ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించారు.

 

కేవలం పదవులని హ్యాండిల్ చేయడంలోనే కాదు, రాజకీయ నాయకుడుగా ఎదగడంలో కూడా చినబాబు ఫెయిల్ అయ్యారు. ఈ విషయం చంద్రబాబుతో సహ టీడీపీ నేతలకు తెలుసు. ఇక సొంత కేడర్ కూడా చినబాబుపై అసంతృప్తిగానే ఉన్నారు. సరే మెల్లగా నాయకుడుగా ఎదుగుతాడు అనుకుంటే...అది జరిగేలా కనిపించడం లేదు. అధికారం కోల్పోయిన కూడా లోకేశ్ తీరులో పెద్దగా మార్పు వచ్చినట్లు కనబడటం లేదు. ఇప్పటికే 70 ఏళ్ళు వచ్చిన చంద్రబాబే అటు ఇటు తిరుగుతూ కష్టపడుతున్నారు తప్ప...చినబాబు పెద్దగా పొడిచేది ఏం ఉండటం లేదు.

 

సరే బయట పెద్దగా లేకపోయిన...ఎమ్మెల్సీ పదవి ఉంది కదా మండలిలో ఏదైనా సాధిస్తాడు అనుకుంటే...అక్కడ కూడా లోకేశ్ ఘోరంగా విఫలమవుతున్నారు. ఈ విషయం తాజాగా జరిగే శాసనమండలి సమావేశాల్లో స్పష్టంగా తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా చినబాబు దాదాపు గంటసేపు వరకు ఉపన్యాసం ఇచ్చారు. ఇక ఆ ఉపన్యాసం చూసుకుంటే..ఒక పిల్లవాడు పాఠం అప్పజెప్పినట్లుగా చెప్పారు. కనీసం అమరవాతే రాజధానిగా ఉండాలని స్ట్రాంగ్ గా మేటర్ చెప్పకుండా ఏదేదో మాట్లాడారు. సరే ఇక్కడితో అయిపోయిందా..అంటే ఏదో తెలిసి తెలియకుండా ప్రభుత్వం దేవాలయ భూములు అమ్మేస్తుందని, జీవో కూడా ఇచ్చిందని మాట్లాడారు.

 

దీంతో ఆర్ధిక మంత్రి బుగ్గన అందుకుని ఆ జీవో ఏంటో చెప్పాలని ఛాలెంజ్ చేయడంతో..తర్వాత చెబుతా అని చెప్పి, కాసేపు ఆగి మొబైల్ తీసి అందులో ప్రభుత్వం జారీ చేసిన సర్కిలర్ చదివారు. అది కూడా హైకోర్టు చెప్పిన మేరకు అమ్మకానికి ఉండే భూములు గురించి జారీ చేసిన సర్కిలర్. జీవో కాదు. దీంతో చినబాబు మాటలు చూసిన తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే అవాక్కయ్యారనే చెప్పొచ్చు. బాబోయే ఈ చినబాబు బుర్ర ఇంకా పెరగలేదని, వాళ్ళ బుర్రలు బద్దలుగొట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: