భారతదేశంలో కరోనా  వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలందరికీ అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలు పూర్తిగా నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక లాక్ డౌన్  ఉన్న సమయంలో ప్రజలు ఎవరు ఇల్లు దాటి బయటకు రాకూడదు అంటూ సూచించారు. ఈ లాక్ డౌన్ సమయంలో  జనజీవనం స్తంభించి పోతుంది. అయితే ఇలాంటివి ముందుగానే ఊహించిన రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్ర ప్రజలు ఎవరూ లాక్ డౌన్  సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు తగిన సహాయం అందజేస్తున్నారు. 

 


 ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి 1500 రూ  అందించడంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఉన్న వారికి వెయ్యి రూపాయలు అందించటం తో  పాటు పలు సరుకులు కూడా రేషన్ ద్వారా అందిస్తున్నారు. అయితే ప్రజలకు లాక్ డౌన్  నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో చేయూతనిచ్చే విధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలు తీసుకుంటున్నారు. కేవలం రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే కాకుండా భవన నిర్మాణ రంగ కార్మికులు ప్రతి ఒక్కరి ఖాతాలో 1000 రూపాయలు జమ అయ్యే విధంగా చర్యలు చేపడుతోంది యూపీఏ సర్కారు. 

 

అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కూడా అందించేందుకు సిద్ధమైంది.అటు  కేరళ ముఖ్యమంత్రి విజయన్  కూడా ఇదే దారిలో నడుస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. లాక్ డౌన్  నేపథ్యంలో ప్రజలు ఎవరు కాస్త ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు చేపడుతుంది కేరళ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 రకాలైన నిత్యవసర వస్తువులను అందించేందుకు విజయన్  ప్రభుత్వం నిర్ణయించింది.  కాఫీ పొడి కారం ఉప్పు లాంటి పదార్థాలు కూడా  ఇందులో  ఉండనున్నాయి. అయితే ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తే ప్రజలకు ఎంతో చేయూతనిచ్చినట్లు  అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: