నేడు దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. బెంచ్ మార్క్ సూచీలు నేడు నేలచూపులు చూశాయి. కరోనా వైరస్ కేసులు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో స్టాక్ మార్కెట్ లో నష్టాల్లోకి వెళ్ళాయి. భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్ చివరి వరకు అదే నష్టాలను కొనసాగుతూ రోజుని ముగించాయి. ఇక నేడు ఇంట్రాడే లో సెన్సెక్స్ 500 పాయింట్ల పడిపోగా నిఫ్టీ కూడా బాగానే పతనమైంది. ఇక నేడు మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టపోయి 34962 పాయింట్ల వద్ద, అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 10312 వద్ద ముగిశాయి.

 


ఇక నేటి స్టాక్ మార్కెట్ లాభనష్టాల విషయానికి వస్తే.... నిఫ్టీ 50 లో హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, సిప్లా, కోటక్ మహేంద్ర బ్యాంక్, ఐటిసి, బ్రిటానియా షేర్లు లాభాల బాట పట్టాయి. ఇందులో బ్రిటానియా కంపెనీ షేర్ 2 శాతం పైగా లాభపడింది. ఇక అలాగే మరో వైపు టెక్ మహీంద్రా, హిందాల్కో, ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇక ఇందులో కోల్ ఇండియా దాదాపు 5 శాతం పైన నష్టపోయింది. అయితే నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్ లు కాస్త మిశ్రమం గానే ముగిసాయి. నిఫ్టీ FMCG తప్పించి మిగతా ఇండెక్స్ లు అన్నీ కూడా నష్టపోయాయి.

 


ఇంకా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. అందులో బ్రెంట్ ముడి చమురు ధర 0.39 శాతం పెరిగి 41.12 డాలర్లకు చేరుకుంది. ఇక మరోవైపు డబ్ల్యూటీఏ ముడి చమురు ధర బ్యారెల్ కు 0.65 శాతం పెరిగి 38.3 డాలర్లకు చేరింది. అలాగే మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయ మారకపు విలువ డాలర్ తో పోలిస్తే 7 పైసలు లాభంతో 75.58 దగ్గర కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: