ఇండియా- చైనా బోర్డర్‌లో ఘర్షణ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. అయితే చైనాతో ఉన్న సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి ప్రత్యేకమైంది. పాక్ వైపు ఉన్న తరహా కాదు. పాక్ వైపు అయితే మన సైనికులు ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉండొచ్చు. కానీ చైనావైపు సరిహద్దుల్లోని సైనికులకు కొన్ని ప్రత్యేకమైన నియమాలుంటాయి. భారత్ -చైనాలకు 1996లో కుదిరిన ఒప్పందం ప్రకారం వాస్తవాధీన రేఖకు తుపాకులు, ఇతర రసాయిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు.

 

 

చైనా బోర్డర్‌లోని సైనికులు తుపాకుల వంటి ఆయుధాలు వాడకూడదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అందుకే.. గల్వాన్ వద్ద జరిగిన ఘర్షణలో ముష్టి యుద్ధమే జరిగింది. కాల్పులు కాదు. అందుకే చైనా సరిహద్దుల్లో భారత్ ఘాతక్ బృందాలను మోహరిస్తోంది. భారత్ ఘాతక్ బృందాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఘాతక్ కమాండోల శిక్షణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

 

 

ఈ ఘాతక్ కమాండోలకు దాదాపు 43 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కర్ణాటకలోని బెల్గాంలో ఇస్తారు. దీనిలో భాగంగా వారు నిత్యం 35 కిలోల బరువు వీపుపై వేసుకొని 40 కిలోమీటర్ల మేరకు పరుగు తీస్తారు. అందుకే వీరికి తొందరగా అలసట రాదు. సైన్యంలో ఇచ్చే ఆయుధ శిక్షణకు తోడు కేవలం చేత్తో శత్రువును మట్టు పెట్టేందుకు అవసరమైన టెక్నిక్ లను నేర్పిస్తారు.

 

 

ఇక ఈ ఘాతక్‌ యూనిట్ లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తో కలిపి 22 మంది ఘాతక్ లు ఉంటారు. వీరికి మరో బృందం ఆల్టర్నేటివ్ గా ఉంటుంది. ప్రతి యూనిట్ లో దాదాపు 45 మంది వరకు కమాండోలు ఉంటారు. ప్రతి ఇన్ ఫాంట్రీ ఆఫీసర్ ఏటా ప్రత్యేక శిక్షణకు వెళతాడు. ప్రతి యూనిట్ లో 40 మంది వరకు జవాన్లను కూడా ప్రత్యేక శిక్షణకు పంపిస్తారు. వీరు శిక్షణ ముగించుకొని వచ్చాక కమాండో బృందంలో చేరతారు. అందుకే గల్వాన్‌లో చైనా సేనలను భారత్ మట్టికరిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: