
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వ్యాక్సిన్ తయారీ పనిలో పలు కంపెనీలు కృషి చేస్తున్నాయి. దేశంలో మూడు కంపెనీలు వ్యాక్సిన్ తయారీ లో ముందంజలో ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే ది తెలియడం లేదు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టతనిచ్చారు.
భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ స్పష్టతనిచ్చారు. దేశ ప్రజలకు మరో నాలుగు, ఐదు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలు వెల్లడించారు.
దేశంలోని సుమారు 30 కోట్ల మంది భారతీయులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు కరోనా టీకాను అందించనున్నట్టు తెలిపారు. అయితే దేశంలో ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు తప్పనిసరిగా వాడాలని కోరారు.