దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున రైతుల ఆగ్రహ జ్వాలలు రోజు రోజు కి ఎక్కువయిపోతున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వేలకొలది రైతులు ఢిల్లీ కి చేరుకొని ఆందోళన చేస్తున్నారు.. అయితే ఈ ఆందోళన ను కేంద్రం పట్టించుకోకున్నా అక్కడి నిరసనలతో వారికి చెమటలు మాత్రం పడుతున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు ల‌క్ష‌లాది మంది ఎనిమిది రోజులుగా ఎముకలు కొరికే చ‌లిలో నిరీక్షిస్త‌న్నారు. ఇప్ప‌టికే న‌లుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్ర‌భుత్వం మాత్రం సానుకూలంగా స్పందించ‌డం లేదు. అసలు ఏమీ జరగనట్లుగానే ప్రభుత్వం వేడుక చూస్తుంది..

నిజానికి కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లును చాలా పార్టీ లు నిరాకరించాయి.అయినా కొన్ని పార్టీ లను బెదిరించి మరీ మోడీ దానికి ఆమోద ముద్ర వేయించుకున్నారు..తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం ఆ బిల్లుకు సపోర్ట్ చేయగా తెలంగాణా ప్రభుత్వం మాత్రం వ్యతిరేకంగా నిలిచింది.. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా జగన్ ఈ బిల్లుకు సానుకూలంగా ఉన్నారని తెలుస్తునిడ్.. అయితే పార్టీ లను, నాయకులను అయితే బెదిరించగలరు కానీ రైతులను బెదిరించలేరు కదా అందుకే అన్నదాతలు తమకు జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం వినిపించేలా ఢిల్లీ లో నిరసన గళాలను వినిపిస్తున్నారు.

చ‌ర్చ‌ల పేరుతో చేసిన నామమాత్ర‌పు ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో రైతుల ఆందోళ‌నపై త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌తీసింది బీజేపీ. అయినా... అడుగు వెన‌క్కి త‌గ్గేది లేదంటూ ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లోనే భీష్మించుకు కూర్చున్నారు రైతులు. హ‌ర్యానా ఢిల్లీల‌ను క‌లిపే ఐదు ర‌హ‌దారుల‌ను దిగ్భంధం చేశారు.పాల‌క విధానాల‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తిన దేశ రైతాంగం చారిత్రాత్మ‌క పోరాటాన్ని న‌మోదు చేసింది. ఇది కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న పోరాటం మాత్ర‌మే కాదు. రైతుల పొట్ట‌లుగొట్టి కోట్ల‌కు కోట్లు పోగుజేసుకుంటున్న కార్పోరేట్ కంపెనీల‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న పోరాటం. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే అంబానీ, అదానీల అగ్రో బిజినెస్ కు వ్య‌తిరేకంగా చేస్తున్న పోరాటం. ఇది అక్ష‌రాలా నిజం. 

మరింత సమాచారం తెలుసుకోండి: