జగన్ సర్కార్ ప్రజలకు మరోసారి తీపి కబురు అందిస్తున్నారు..ప్రజల సంతోషం కోసం ఎన్నో కొత్త పథకాలను అమల్లోకి తీసుకు వస్తున్న జగన్ ఇప్పుడు ఆంధ్రుల ఇళ్ళలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి ఇంటికి 4 ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బల్బు రూ.10 చొప్పున అత్యధిక సామర్థ్యం గల నాలుగు ఎల్‌ఈడీ బల్బులను విద్యుత్‌ శాఖ ప్రతి ఇంటికి అందించనుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ 'గ్రామ ఉజాలా' పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు..



నిన్న మీడియాతో మాట్లాడిన జగన్ ఈ విషయం పై చర్చించారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి చేపట్టే ఈ పథకాన్ని దేశంలో ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈఈఎస్‌ఎల్‌ రూ.450 కోట్ల పెట్టుబడిని ఈ పథకానికి వెచ్చిస్తున్నట్లు తెలిపారు.ఇంధన పొదుపులో భాగంగా గతంలో 9 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు అందించారు. ఇప్పుడు 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు అందిస్తారు. సాధారణ బల్బుతో పోలిస్తే 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బుల వల్ల 75 శాతం కరెంట్‌ ఆదా అవుతుంది. 25 శాతం మన్నిక ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించే సామర్థ్యం ఈ బల్బుకు ఉంది.



అందుకోసం ప్రజలు ఈ బల్బులను ఉపయోగించడం వల్ల కరెంట్ ఆదా అవుతుందని అంటున్నారు. దశల వారీగా ఈ బల్బులను పంపిణీ చేస్తున్నారు.ముందుగా కృష్ణా జిల్లాలోని గుణదల, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ టౌన్, రూరల్‌లో ప్రతి ఇంటికి 12 ఓల్టుల ఎల్‌ఈడీ బల్బులు నాలుగు ఇస్తారు. జిల్లాలోని 9 లక్షల ఇళ్లకు ఈ బల్బులను అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.గృహ విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బల్బులు తీసుకోవచ్చు. ఈఈఎస్‌ఎల్‌ నేతృత్వంలో స్థానిక విద్యుత్‌ అధికారుల సమన్వయంతో పంపిణీ జరుగుతుంది. ఈ కొత్త ప్రయత్నం కృష్ణాలో విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని జగన్ సర్కార్ పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: