చైనా.. ఇది కరోనాకు పుట్టినిల్లన్న సంగతి తెలిసిందే.. కరోనాను ప్రపంచం మొత్తానికి ఎగుమతి చేసి.. ఇప్పుడు తాను చాలా జాగ్రత్త పడుతోంది. ఆ జాగ్రత్త పడుతోంది. ఎంత జాగ్రత్త అంటే.. చైనాలోకి ఎంటర్ అయ్యే.. విదేశీయులకు అన్ని పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈ పరీక్షల్లో అతిగా జాగ్రత్త పడటం ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతోంది. ఈమధ్య చైనా కరోనా పరీక్షలకు సంబంధించి ఏం చేస్తున్నదంటే .. వేరే  దేశాల నుంచి వచ్చినవాళ్లకు, క్వారంటైన్లలో ఉన్నవాళ్లకు, అనుమానితులకు యానల్ స్వాబ్ టెస్టులు చేస్తోంది.


యానల్ స్వాబ్ టెస్టులు అంటే.. అదో అవమానకరమైన పరీక్ష.. సాధారణంగా థ్రోట్ స్వాబ్, నోస్ స్వాబ్ అంటే ముక్కు లోపల గోడలకు, గొంతు లోపల గోడలకు ఉండే జిగట, శ్లేష్మాన్ని శాంపిల్‌గా తీసుకుని వైరస్ ఉనికి కోసం పరీక్షిస్తారు. కానీ.. యానల్ స్వాబ్ టెస్టు  అంటే.. మలవిసర్జనమార్గం, అంటే గుదము నుంచి శాంపిల్ తీసుకుంటారు. ఇది చాలా అవమానకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు చైనాలోకి ఎంటరైన అమెరికన్లు ఇదే గోల పెడుతున్నారు.


అందులోనూ చైనా.. విదేశాంగ శాఖ ద్వారా వచ్చిన రాయబారులను సైతం వదలడం లేదట. దీంతో వాళ్లంతా తమ సొంత దేశానికి కంప్లయింట్ ఇచ్చారు. దీంతో అమెరికా చైనా పై గయ్యిమందట. మావాళ్ల పట్ల ఇది అగౌరవ చర్య..  మర్యాద తప్పడం, ఏమాత్రం హుందాగా లేదు.. వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్య సిబ్బంది మానమర్యాదల్ని కాపాడాల్సింది పోయి మీరే మర్యాదల్ని అతిక్రమిస్తారా..? ఏం బాగాలేదు.. మీ వివరణ ఏమిటి..? ఆ పరీక్షలు తక్షణం ఆపండి అంటూ అమెరికా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


దీంతో.. చైనా కూడా ఘాటుగానే సమాధనం చెప్పిందట. ఎప్పుడూ నిజం చెప్పడం పెద్దగా అలవాటు లేని చైనా ఈ విషయంలోనూ  బొంకిందట. అబ్బే మేం అలా చేయలేదని సమాధానం చెప్పిందట. అయితే  అమెరికా అలా తేలికగా విడిచిపెట్టదు కదా. ఆధారాలతో మళ్లీ ఫిర్యాదు చేసిందట. దీంతో చైనా.. అవును పొరపాటు జరిగింది.. ఇకపై అలా చేయబోమని హామీ ఇచ్చిందట. అదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: