రిలయన్స్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ధీరుబాయ్ అంబాని దీన్ని స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. ఇక ఆయన చనిపోయాక ఆయన వారసులు ముఖేష్ అంబాని, అనిల్ అంబాని దానిని డెవలప్ చేశారు. అయితే అనిల్ అంబాని తనవంతు నష్టపోగా ముఖేష్ అంబాని అయితే అంచెలంచెలుగా ఎదుగుతూ రిలయన్స్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్లాడు. ఎంతలా అంటే దాని గురించి ప్రపంచం అంతలా తెలిసేతంటల విస్తరించారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో భాతదేశం తరపున ఒకడిగా దూసుకుపోతున్నాడు ముఖేష్ అంబాని.అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు బాగా సంపాదించాడు.అలాగే తమ సంస్థ తరపున స్వచ్చంద సంస్థల సాయంతో సమాజానికి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు...



ఇక ఆయన భార్య నీతు అంబాని తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత స్వచ్చంద సేవలకు కేటాయించాలని కృషి చేస్తుంటుంది.తమ రిలయన్స్ ఉద్యోగస్తులకి నీతు అంబాని ఒక అద్భుతమైన స్టేట్ మెంట్ ఇచ్చి అభినందనలు పొందుతుంది.ఇక వీరు వ్యాపారంతో పాటు ఒక స్వచ్చంద సంస్థను కూడా నడుపుతున్న సంగతి తెలిసిందే...ఇక ఆ ట్రస్ట్ కి నీతు అంబాని నాయకత్వం వహిస్తుంది.ఇక ప్రతి వ్యాపార సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ సర్వీస్ కింద తమ వ్యాపారంలో 2% డబ్బుని సమాజానికి వినియోగించాలి . కాని నీతు అంబాని కేవలం సమాజానికే కాదు తమ ఉద్యోగులకు కూడా వినియోగిస్తున్నారు. తమ రిలయన్స్ ఉద్యోగస్తులకి కూడా ఉచితంగా వాక్సీనేషన్ వేయించనున్నట్లు ప్రకటించడం జరిగింది.ఈమె తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది ఉద్యోగస్తులకి మంచి విషయం అనే చెప్పాలి.ఈ విషయంలో నిజంగా నీతూ అంబాని గారు పలువురికి ఆదర్శవంతులారయ్యారు.ఇలా తమ ఉద్యోగస్తుల గురించి ఆలోచించి వారికి అండగా నిలవడం చాలా మెచ్చుకోవాల్సిన విషయం అనే చెప్పాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: