బ్లాక్ ఫంగస్.. ఇప్పడు కరోనా వచ్చిన వారిని వణికిస్తున్న మరో మాయదారి రోగం. కరోనా నుంచి కోలుకున్నా ఇలాంటి మాయదారి పీడిస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ గురించి అంతగా భయం వద్దంటున్నారు  కర్నూలు కు చెందిన గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు సి. ప్రభాకర రెడ్డి. ఇది అరుదుగా వచ్చే వ్యాధి అని.. అందరికీ రాదని చెబుతున్నారు.  

ఆయన ఏమంటున్నారంటే..

 
“ బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకరోమైకోసిస్  అనే రైజోఫస్ జాతికి చెందిన మనుషులకు హాని చేసే శిలీంధ్రము. ఇది చెత్తచెదారం కుళ్ళే ఆకులు, కూరగాయలు, పండ్లు, చెక్క, పేడ లాంటి ప్రదేశాలలో ఉండే వాతావరణంలో స్పోర్సు ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనం గాలి పీల్చినపుడు ముక్కులోని సైనసులు అనే గాలిబుడగలలో చేరి పెరుగుతుంది. ఇది కండ్లు, మెదడుకు వ్యాపిస్తే చాలా ప్రమాదము. ఇది ముక్కు, ఊపిరితిత్తులు, పేగులు, చర్మం ఎక్కడైనా రావచ్చు.

ఇది సర్వాంతర్యామి. ఆరోగ్య వంతులైన మనుషుల ముక్కులో అలా ఉంటది. హాని చేయదు. ఇమ్యూనిటీ తగ్గితే దాడి చేస్తుంది. ఇది గతంలో కిడ్నీ మార్పిడి, కాన్సరు, హెచ్‌ఐవీ రోగులు, ఇమ్యునో సప్రెషన్ మందులు వాడేవారికి వచ్చేది. డయాబెటిస్ కంట్రోలు లేకున్నా అరుదుగా వస్తుంది. ఇది అత్యంత అరుదుగా వచ్చే ప్రమాదకరమైన అంటువ్యాధి. కాని మామూలు వారికి రాదు. భయం అవసరం లేదు.

కోవిడ్ లో సైటోకైన్ స్టార్మ్ తో కేసులు చేరినపుడు అది మన ఇమ్యూనిటీ ఓవర్ రియాక్షన్ వల్ల వస్తుంది. దానిని తగ్గించే స్టెరాయిడ్సు అధిక మోతాదులో ఇస్తారు. అపుడు ఇమ్యూనిటీ తగ్గించే ప్రక్రియ మన ప్రాణదాత అవుతుంది. ఇదే సమయంలో షుగర్ లెవల్సు డయాబెటిక్ లో పెరుగుతాయి. అపుడు మన కణజాలలో ఈ ఫంగస్ పెరుగుతుంది. షుగర్ కంట్రోలులో ఉంటే ఏమి కాదు. చాలా మందిలో 12-15 రోజుల తర్వాత రికవరీ వస్తోంది. కొందరు డయాబెటిస్ రోగులకు ఇది రావచ్చు."

మరింత సమాచారం తెలుసుకోండి: