మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అధికారం కోల్పోయిన తరువాత కొంత మంది కడుపు నొప్పితో బాధపడుతున్నారని పేర్కొన్న ఆయన “వారు తమను తాము చూసుకోవాలి, నేను వారికి మందులు ఇవ్వలేను, కాని నేను వారికి రాజకీయ మందులు ఇస్తాను” అని ఆయన పేర్కొన్నారు. ఇక శివసేన మునుపటి కంటే బలంగా ఉద్భవించిందని పేర్కొన్న ఆయన మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన చేసిన కామెంట్స్ అన్నీ బీజేపీను ఉద్దేశించినవే అని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టు జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ అనే కోణం కూడా ఈ కామెంట్స్ వెనుక ఉందనే వాదన విపిస్తోంది. 


ఇక శివసేన యొక్క హిందుత్వ ఆధారాలను ప్రశ్నించినందుకు బిజెపిపై దాడి చేసిన ఉద్ధవ్, కాంగ్రెస్, congress PARTY' target='_blank' title='నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) లతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత శివసేన విడిచిపెట్టడానికి హిందుత్వం అంటే ఒక సంస్థ కాదని అన్నారు. "హిందుత్వం ఒక సంస్థ కాదు, వారు చెప్పినట్లుగా, శివసేన వదిలిపెట్టలేదు అని అన్నారు. మేము కాంగ్రెస్ మరియు ఎన్సిపిలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న ఆయన హిందుత్వం గుండె నుండి వస్తుందని అన్నారు. కొంత మంది ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నరని కానీ ప్రస్తుతం తాము పేదల కోసం పనిచేయాలి ” అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 


తన పార్టీ 55వ ప్రారంభోత్సవ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన సిఎం, అధికారం కోసమేనా లేదా ఆర్థిక సమస్యల పరిష్కారానికి అనేది రాజకీయ పార్టీలు నిర్ణయించుకోవాలని అన్నారు. ఆర్థిక, ఆరోగ్య సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనకుండా రాజకీయ నాయకులు మూర్ఖ రాజకీయాల్లో పాల్గొంటే, భారత్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని శివసేన అధినేత హెచ్చరించారు. జాతీయ రాజకీయాల్లో పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని రాజ్యసభ ఎంపి సంజయ్ రౌత్ చెప్పిన కొన్ని రోజులకే శివసేన అధినేత నుండి ఈ ప్రకటన రావడంతో ఆసక్తి నెలకొంది. ముంబైలో విలేకరులను ఉద్దేశించి రౌత్ మాట్లాడుతూ, సేన రాష్ట్ర సరిహద్దులు దాటి డిల్లీకి చేరుకుందని కామెంట్స్ చేశారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: