గుంటూరు నగరంలో ఎప్పుడూ భిన్నమైన ఫలితాలే వస్తాయి. నగర పరిధిలో ఉన్న ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో రెండు వేరు వేరు పార్టీలే గెలుస్తూ వస్తున్నాయి. అయితే కొత్తగా నియోజవర్గాలు ఏర్పడిన 2009లో మాత్రం రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కానీ ఆ తర్వాత నుంచి ఫలితాలు మారుతూ వచ్చాయి. 2014 ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్‌లో వైసీపీ సాధించింది. కానీ గుంటూరు వెస్ట్‌లో టి‌డి‌పి మంచి మెజారిటీతో గెలిచింది.

అధికారంలో ఉన్నా సరే ఈస్ట్‌పై టి‌డి‌పి పట్టు సాధించలేకపోయింది. ముస్లిం ఓటర్లు ప్రభావం ఎక్కువగా ఉన్న ఈస్ట్‌లో టి‌డి‌పి పుంజుకోలేకపోయింది. ఒకవేళ 2014లో టి‌డి‌పి తరుపున ముస్లిం అభ్యర్ధిని నిలబెడితే ఫలితం మారేది ఏమో..కానీ టి‌డి‌పి తరుపున మద్దాలి గిరిని నిలబెట్టారు. దీంతో ఆయన స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికలోచ్చేసరికి సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈస్ట్‌లో మరోసారి వైసీపీ జెండా ఎగిరింది. వైసీపీ తరుపున ముస్తఫా మరొకసారి గెలిచారు.

అటు వెస్ట్‌లో టి‌డి‌పి గెలిచింది...కానీ అభ్యర్ధి మారారు. 2014లో టి‌డి‌పి తరుపున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలిచారు....2019 ఎన్నికల ముందు మోదుగుల వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో వెస్ట్ నుంచి మద్దాలి గిరి పోటీ చేసి గెలిచారు. కానీ ఈయన కూడా వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో గుంటూరు నగరంలో టి‌డి‌పికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

అయితే ఈ సారి రెండు నియోజకవర్గాలపై పట్టు సాధించాలని టి‌డి‌పి భావిస్తుంది... అటు రెండు చోట్ల పట్టు నిలుపుకోవాలని వైసీపీ చూస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీకే బలం కనిపిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి అది మరింత పెరిగితే...ఈస్ట్, వెస్ట్‌ల్లో టి‌డి‌పి సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: