ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులకు ప్రపంచం అంతా కన్నీరు కారుస్తోంది. నేటికీ రష్యా ఉక్రెయిన్ పైకి దండెత్తి వచ్చి వారం దాటుతోంది, లక్షల సంఖ్యలో ప్రజలు మరియు సైనికులు నేలకొరిగారు. రోజు రోజుకీ పరిస్థితి చెయ్యి దాటుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రోజుకో సరికొత్త వ్యూహంతో దాడులు చేస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని ముప్ప తిప్పలు పెడుతున్నాడు. తాజాగా అణు ఆయుధాలను కూడా వాడడానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇవి కనుక ప్రయోగిస్తే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. రష్యా పై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ రెండు రోజుల ముందు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా రష్యా చేస్తున్నా దాడిని వ్యతిరేకిస్తున్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి.

అలాంటిది తాజాగా బోరిస్ జాన్సన్ కు పోలాండ్ పర్యటనలో ఉక్రెయిన్ మహిళా జర్నలిస్ట్ చేతిలో చుక్కెదురైంది. పోలాండ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరు అయిన జాన్సన్ ను మహిళా జర్నలిస్ట్ తన ప్రశ్నలతో చుక్కలు చూపించింది. ఈమె మాట్లాడుతూ, ఈ రోజు ఉక్రెయిన్ ఈ పరిస్థితిలో ఉంది అంటే కారణం మీరు కాదా అంటూ ప్రశ్నించింది. యుద్ధం మొదలై వారం రోజుల పైగా అవుతున్నా ఇప్పటికి ఏదైనా చేసి యుద్ధం ఆపకుండా, ఎంతసేపటికీ ఆర్థిక ఆంక్షలు అంటూ కహానీలు చెబుతున్నారంటూ జాన్సన్ పై ఫైర్ అయింది. అమాయక ప్రజలపై బాంబుల వర్షం కురుస్తోంది దీనికి కారణం మీరు కాదా అంటూ గట్టిగా అడిగింది.

రష్యా ప్రజలు మాత్రం సురక్షితంగా ఉన్నారు.. మరియు రష్యా బిలియనీర్ల పిల్లలు కూడా వేరే దేశాల్లో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం యుద్ధంతో సంబంధం లేకుండా ఉన్నారు, కానీ మా పిల్లలు అందరూ నెత్తుటి ముద్దల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు అంటూ తన ఆవేదనను అతనిపై వెళ్లగక్కింది. ఇంతటి పరిస్థితుల్లో మీరు పోలాండ్ పర్యటనకు వచ్చారే కానీ, కీవ్ కు ఎందుకు రాలేదు అంటూ నేరుగా ప్రశ్నించింది. ఇలా ఆమె ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఏమి సమాధానం చెప్పాలో బోరిస్ జాన్సన్ కు అర్థం కాక నీళ్ళు నమిలాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: