ఈ రోజుల్లో ఎక్కువగా ప్లాస్టిక్ పదార్థాలను ఎక్కువగా వాడతున్నారు..ప్రతి చిన్న వస్తువు కొనాలని అనుకున్న కూడా ప్లాస్టిక్ కవర్ లు తప్పనిసరి అయిపోయాయి.నీళ్ల దగ్గర నుంచి పడుకోనే బెడ్ వరకూ అన్నీ ప్లాస్టిక్ మయం అయిపోయింది.ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగానికి చాలా అలవాటు పడిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించమని ఎంత చెప్పినా ప్రజలు వినడం లేదు.నీళ్ల బాటిల్‌ నుంచి ఆహారం తినే ప్లేట్ వరకు ప్రతీది ప్లాస్టిక్ వాడుతున్నారు. దీనివల్ల మనకి తెలియకుండానే చాలా వ్యాధులకి గురికావల్సి వస్తోంది. ఆఫీసుకు లేదా వర్కవుట్‌కి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని తీసుకువెళుతాము.


చాలా చోట్ల తాగునీటికి ప్లాస్టిక్‌ గ్లాసులే వినియోగిస్తున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..ప్లాస్టిక్ ఒక పాలిమర్. ఇందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరైడ్ ఉంటాయి. ఇవి కాకుండా ప్లాస్టిక్‌లో ఒక రకమైన రసాయనం ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా ప్రాణాంతకం. వైద్యుల ప్రకారం రసాయనాలు, పాలిమర్లలో ఉండే మూలకాలు మన శరీరంలోకి వెళితే అది అనేక వ్యాధులకు దారి తీస్తుంది. నేటి రోజుల్లో ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వ్యాధులు పెరిగిపోతున్నాయి.


ప్లాస్టిక్ బాటిల్ లో ఎక్కువ సేపు నీటిని ఉంచితే మంచిది కాదు. ఒక వ్యక్తి ఆ నీళ్లని తాగితే చాలా తీవ్రమైన వ్యాధులను కలిగిస్తుంది. పురుషులలో హార్మోన్ల ఆటంకాలు ఏర్పడుతాయి. ఇది కాకుండా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కాలేయానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అంతే కాదు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరం..అందుకే వీటిని ఈ మధ్య కాలంలో నిషేధించింది..ప్లాస్టిక్ బాటిళ్లను చాలా రోజులుగా ఫ్రిజ్‌లో ఉంచుతారు. దీనివల్ల ప్లాస్టిక్ బాటిల్‌లో ఉన్న DPA, ఇతర రసాయనాలు శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది. నీటికోసం రాగి పాత్రలు వాడితే మంచిది. ప్రాచీన కాలంలో కూడా ప్రజలు రాగి పాత్రలను మాత్రమే ఉపయోగించారు..వాటిలోని నీళ్ళు చాలా ఆరోగ్యం అని నిపుణులు అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: