ఆంధ్రప్రదేశ్లోని టిడిపి జనసేన బిజెపి పొత్తుల వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ముఖ్యంగా సీట్ల విషయంలో అటు అభ్యర్థుల విషయంలో ఎవరికి వారు తోచిన విధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు.. బిజెపి పార్టీకి ఆంధ్రలో పెద్దగా ఓటింగ్ శాతం లేదని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా డిపాజిట్ తెచ్చుకొనే గట్టి లీడర్లు కూడా లేనటువంటి బిజెపి పార్టీకి 6 MP,10 mla సీట్లను తీసుకుంది.. అయితే ఈ సీట్లను గెలిపించే బాధ్యత అటు టిడిపి జనసేన మీదే ఉందని చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు అదే పని చేయడానికి సిద్ధమవుతున్నాయి కానీ ఈ విషయం పైన కూడా బిజెపి సంతృప్తి చెందడం లేదు.

దీంతో తమకు మరో సీటు కావాలని డిమాండ్ కూడా చేస్తున్నది. బిజెపి ఎన్నికల ఇన్చార్జ్ అరుణ్ సింగ్  ఇటీవల విజయవాడలో సమావేశంలో మాట్లాడారు.. ఇందులో బిజెపి 11 ఎమ్మెల్యే సీట్లలో పోటి చేస్తుందని కూడా వెల్లడించారు.అయితే ఆ 11డో సీటు ఏది అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు.. టిడిపి నుంచో జనసేన నుంచో కచ్చితంగా ఒక సీటును లాక్కోవడం ఖాయమని కనిపిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఎక్కడ కనిపించలేదు.


ఇతర రాష్ట్రాలలోని నాయకులకు ఇవ్వడం లేకపోతే ఆర్థిక స్తోమత చూసి ఇవ్వడము వంటివి చేస్తున్నారు బిజెపి.. అయితే ఇప్పుడు బిజెపి 11 సీటు అని రంగంలోకి దిగడంతో అటు టిడిపి జనసేన మధ్య నాయకుల సైతం కాస్త ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాజంపేట లేదా తంబళ్లపల్లె నియోజవర్గాలలో ఏదో ఒక వాటిని కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయం పైన టిడిపి ఎక్కడ స్పందించలేదు. జనసేన పార్టీ కూడా ఇంకా మూడు స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది ఇప్పటికే పొత్తుల వ్యవహారం వల్ల నరసాపురం సీటు రఘురాంకు కేటాయించకపోవడంతో ఇరువురు పార్టీ నేతలు కూడా చాలా అసహనంతో ఉన్నారు. మరి బిజెపి ఆ 11వ సీటు తీసుకుంటే పొత్తులు సన్నగిల్లే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: