ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ప‌రిధిలో చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల‌కు 50 రోజుల ముందే రాజ‌కీయం గ‌త్త‌ర లేస్తోంది. టీడీపీ ఫుల్ స్వింగ్‌లో వార్ వ‌న్‌సైడ్ చేసుకుంటూ దూసుకుపోతుంటే అధికార వైసీపీ నెల రోజుల్లోనే ఏకంగా ముగ్గురు ఇన్చార్జ్‌ల‌ను మార్చి ప‌డుతు లేస్తూ అతుకుల బొంత‌లా మారింది. ఇప్పుడు పేట వైసీపీలో నాలుగో కృష్ణుడు వ‌చ్చేశాడ్రా బాబు అని వైసీపీ వాళ్లే త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న ప‌రిస్థితి. ఎమ్మెల్సీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ముందు నుంచి పార్టీ పోషిస్తూ వ‌చ్చారు.

ఆ త‌ర్వాత మంత్రి ర‌జ‌నీ.. ఆ త‌ర్వాత మ‌ల్లేల రాజేష్ నాయుడు.. ఇక ఇప్పుడు కొత్త ఇన్‌చార్జ్‌గా వ‌చ్చిన గుంటూరు మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు.. రేపు బీ ఫామ్ తీసుకుని ఫైన‌ల్‌గా ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేస్తారో ఏ మాత్రం తెలియ‌ని ప‌రిస్థితి. కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు నాన్ లోక‌ల్ కావ‌డంతో అస్స‌లు చిల‌క‌లూరిపేట పార్టీ కేడ‌ర్ ఆయ‌న నాయ‌క‌త్వాన్ని ఏ మాత్రం యాక్స‌ప్ట్ చేయ‌ని ప‌రిస్థితి. పైగా సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా కూడా రాజేష్‌, మ‌నోహ‌ర్ నాయుడు ఇద్ద‌రి ఎంపికా త‌ప్పే అంటున్నారు.

ఉన్నంత‌లో రాజేష్ నాయుడు లోక‌ల్ అని చెప్పుకోవ‌డానికి మిగిలి ఉంది.. మ‌నోహ‌ర్ నాన్ లోక‌ల్‌. 2019 ఎన్నిక‌ల‌కు ముందు మ‌నోహ‌ర్ పెద‌కూర‌పాడు పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉండి ఎన్నిక‌ల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకునే క్ర‌మంలోనే జ‌గ‌న్ షాక్ ఇచ్చి నంబూరు శంక‌ర్రావుకు సీటు ఇచ్చారు. ఇప్పుడు చిల‌క‌లూరిపేట సీటు ఇచ్చినా ఎన్నిక‌ల టైంకు బీఫామ్ ఇస్తారా ?  ఇవ్వ‌రా ? అన్న డౌట్లు అయితే ఉన్నాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. ఎవ‌రైనా ఆర్థికంగా బ‌లంగా ఉన్న క‌మ్మ నేత‌ల్లో ఎవ‌రో ఒక‌రు త‌గిలితే ఈ సీటు వాళ్ల‌కు అంట‌గ‌ట్టేయాల‌ని వైసీపీ అధిష్టానం ఆలోచ‌న చేస్తోంద‌ట‌.

అయితే ఓడిపోయే సీటులో పోటీ చేసేందుకు ఎవ్వ‌రూ సాహ‌సించ‌డం లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా రిస్క్ చేసి ముందుకు వ‌చ్చినా.. వాళ్లు ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం తిరిగి అర్థం చేసుకునే టైంకే ఎన్నిక పూర్త‌యిపోతుంది. ఏదేమైనా పేట‌లో ఎన్నిక‌ల‌కు 50 రోజుల ముందే వైసీపీ పూర్తిగా చేతులెత్తేసి.. చేష్ట‌లుడిగి చూస్తోంది. ఇక్క‌డ ఎంత‌మంది అభ్య‌ర్థులు మారుతున్నా టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు క‌నీస పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేదు.

పేట‌లో అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల వ‌ర‌కు చూస్తే పుల్లారావు 20 వేల మెజార్టీపై బెట్టింగుల హోరు మామూలుగా లేదు. కొంద‌రు అయితే ఈ మెజార్టీ 25 - 30 ఉంటుంద‌ని కూడా పందాల‌కు దిగుతున్నా... 20 వేలు అయితే చాలా సేఫ్ అని.. ఎంచ‌క్కా హెచ్చువేసుకుని మ‌రీ పందాలు ప‌ట్టుకోవ‌చ్చ‌ని డిసైడ్ అయిపోయి బెట్టింగుల్లోకి దిగుతున్నారు. దీనిని బ‌ట్టే పేట‌లో పుల్లారావు ఎంత సేఫ్ జోన్‌లో ఉన్నారో తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: