ఏపీ రాజకీయం ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా మారిన వేళ అటు రఘురామ కృష్ణంరాజు విషయం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా గత పార్లమెంటు ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు వ్యతిరేకంగా గలమెత్తాడు రఘురామకృష్ణంరాజు. దాదాపు నాలుగున్నరేళ్లు ఆయన వైయస్సార్ సిపి పార్టీపై, సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ ఎంతగానో పోరాటం చేశారు. కొన్నిసార్లు జైలుకు వెళ్లి పోలీసుల దెబ్బలు కూడా తిన్నారు.


 ఇక సొంత నియోజకవర్గానికి వెళ్తే ఎక్కడ కేసులు పెట్టి హింసిస్తారు అన్న భయంతో ఇక కనీసం నియోజకవర్గం కూడా వెళ్లకుండానే ఉండిపోయారు. ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో రఘురామకృష్ణ రాజు పోటీ చేస్తారా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొనగా   తప్పకుండా పోటీ చేసి తీరుతానని.. ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్తాను అంటూ చెప్పారు. అయితే బిజెపి నుంచి రఘురామ కృష్ణంరాజుకు టికెట్ వస్తుందని అనుకున్నప్పటికీ.. అది జరగలేదు. కనీసం టిడిపి అయిన టికెట్ ఇస్తుందేమో అనుకున్న చంద్రబాబు మాస్టర్ మైండ్ ఏం చెప్పిందో ఇక రఘురామకు టికెట్ కేటాయించాలని ఆలోచన చేయలేదు బాబు.



 అయితే ఇక ఇప్పుడు రఘురామకు   ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది అన్నది తెలుస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ. ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. దానికి తోడు ఇక రఘురామ వియ్యంకుడు అయిన కెవిపి రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు  ఇంకోవైపు నర్సాపురంలో బిజెపి, వైసిపి అభ్యర్థులు ఇద్దరు కూడా పెద్దగా పలుకుబడి ఉన్న వారు కాకపోవడంతో.. ఇక రఘురామ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారే అవకాశం ఉంది. దీంతో రఘురామకు ఉన్న క్రేజ్ ని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap