ఎన్నికలు వచ్చాయి అంటే చాలు రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజల్లో వాలిపోతూ ఉంటారు. కలలో కూడా ఊహించని హామీలను ఇస్తూ ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక ఎన్నికల కమిషన్ ఒక అభ్యర్థి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టాలో చెబుతూ ఉంటుంది. అఫీషియల్ గా ఎన్నికల కమిషన్ చెప్పినా అనఫీషియల్ గా మాత్రం ఖర్చు డబుల్ త్రిబుల్ ఉంటుంది అని చెప్పాలి.


 ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడి కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా కూడా మోగింది. దీంతో ఇక రాజకీయాలు ఆయా రాష్ట్రాలలో వాడి వేడిగా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే కేంద్రంలో రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బిజెపి.. ఇక మూడోసారి కూడా అధికారంలోకి రావాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇక మిగతా పార్టీలు కూడా తమ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇలా ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తున్న నేపథ్యంలో.. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం ఎంతవరకు ఖర్చు పెట్టాలి అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.



 లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు 95 లక్షలు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు 40 లక్షలు ఖర్చు పెట్టుకునేందుకు అనుమతి ఉంది. అయితే కేంద్రపాలిత ప్రాంతాలు కొన్ని చిన్న రాష్ట్రాలకు మాత్రం పార్లమెంట్ అభ్యర్థులు 70 లక్షలు అసెంబ్లీకి 28 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు. అయితే 2019 ఎన్నికల సమయంలోను అన్ని రాష్ట్రాలకు ఇదే లిమిట్ ఉండేది. అయితే దేశం తొలి జనరల్ ఎలక్షన్స్ లో (1951- 52 ) లోక్ సభ ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చు పెట్టుకునే లిమిట్ కేవలం 25000 మాత్రమే ఉండేది. ఇక ఈశాన్య రాష్ట్రాలకు ఇది 10000 రూపాయలుగా మాత్రమే ఉండేది. తర్వాత 1971లో ఈ లిమిట్ రూ. 35000 లకు, 1980లో రూ 4 లక్షలకు, 1998లో 15 లక్షల, 2004లో 25 లక్షలు, 2014లో రూ 70 లక్షలకు అభ్యర్థులు ఖర్చు పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది ఈసి.

మరింత సమాచారం తెలుసుకోండి: