ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నీ పార్టీలు విశ్రుతంగా తమ తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే దాంట్లో భాగంగానే ప్రజాగళం సభలో పాల్గొనటానికి తెదేపా అధినేత ఐనా చంద్రబాబు ఈ నెల 31 తేదీన బాపట్ల వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.ఆయన ప్రకాశం జిల్లా లోని మార్కాపురం నుండి ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు హెలీకాప్టర్‌లో బయల్దేరి బాపట్ల మండలం మహాత్మాజీపురంలో ఉన్న బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగుతారుఅని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి 216 ఏ జాతీయ రహదారిలో ఉన్న కుక్కలవారిపాలెం, దరివాదకొత్తపాలెం మీదుగా బాపట్ల పట్టణంలో బాబు రోడ్‌షో ద్వారా తన ప్రసంగాన్ని నిర్వహించనున్నారు. అది కంప్లీట్ ఐనా అనంతరం పట్టణంలోని జమ్ములపాలెం ఆర్వోబీ అంబేడ్కర్‌ కూడలి వద్ద ఏర్పాటు చేయబడిన ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నారు. దీనికి తెదేపా లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్‌, వేగేశన నరేంద్రవర్మకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ సభను ముగించిన తర్వాత బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలకు చేరుకుని అక్కడ అతిథి గృహంలో చంద్రబాబు రాత్రి బస చేస్తారు అని పార్టీ వర్గాలు చెప్పాయి.ఆ రాత్రి బస చేసిన తర్వాత మరుసటి రోజు ఏప్రిల్‌ ఒకటి(సోమవారం) ఉదయం కళాశాల హెలీప్యాడ్‌ నుంచి హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌ బయల్దేరి వెళ్తారని తెదేపా నేతలు చెప్పారు. అయితే ఈ సభను దిగ్విజయం చేయడానికి తెదేపా నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనికి జనసేన, భాజపా నేతలు తమ తమ మద్దతు అందిస్తున్నారు. అయితే ఈ సభకు సంబంధించి హెలీప్యాడ్‌, రోడ్‌షో, ప్రజాగళం సభకు అనుమతి కోసం అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే దరఖాస్తు చేశారు. తెదేపా అధినేత జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో కూటమి ఐనా తెదేపా-జనసేన-భాజపా శ్రేణులు ఉత్సాహం మాములుగా లేదు అనడంలో ఆశ్చర్యం లేదు.దీనికి సంబంధించి మూడు పార్టీల ముఖ్య నాయకుల ఈ ఉమ్మడి సమన్వయ సమావేశాన్ని తెదేపా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐనటువంటి ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఐతే ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి కూటమి నేతలు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: