ఏపీ పొలిటికల్ కాపిటల్ గా చెప్పుకునే బెజవాడ రాజకీయాల మీద వంగవీటి ఫ్యామిలీ ముద్ర గట్టిగానే ఉంటుంది.విజయవాడ రాజకీయాల గూర్చి ప్రస్థావిస్తే కచ్చితంగా అందులో వంగవీటి బ్రాండ్ గూర్చి మాట్లాడాల్సిందే.1985 లో బెజవాడ తూర్పు నుండి మొదటిసారి వంగవీటి రంగ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు రంగ భార్య రత్నకుమారి ఎమ్మెల్యే అయ్యారు.2004 ఎన్నికల్లో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినా రంగ కొడుకు రాధ పోటీ చేసి గెలుపొందారు.రాధ 2009,2014 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూశారు.2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు అలాగే ఈ ఎన్నికలకు ముందు అప్పటి దాక వైసీపీ ఉన్న రాధ టీడీపీలో చేరారు.పార్టీకి స్టార్ క్యాంపైన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసారు.గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీడీపీలోకి వెళ్లడం వల్ల రాధ పోటీ చేయలేదని అన్నారు.కానీ ఈసారి కచ్చితంగా పోటీ చేస్తారని భావించారు కానీ ఈసారి కూడా పోటీకి దూరంగా ఉంటానని తన సన్నిహితులకి చెప్పేసారంట రాధ.కూటమిలో భాగంగా జనసేన నుండి విజయవాడ ఏదో ఒక సెగ్మెంట్ నుండి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.అదంతా కేవలం ప్రచారమేనని ఇపుడు రాధ నిర్ణయం తర్వాత తెలిసింది.దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వంగవీటి ఫ్యామిలీ ఈసారి కూడా పోటీ చేయకపోవడంపై  వంగవీటి అభిమానులు నిరాశ చెందుతున్నారు.

2019 లో వైసీపీ నుండి టీడీపీకి జగన్ తీరు నచ్చక మారానని రాధ అన్నారు.కచ్చితంగా వైసీపీ ని ఒడిద్దాం అనుకోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన వైసీపీ విజయాన్ని ఆపలేక పోయారు.అయితే ఈసారి వైసీపీ ఓటమే ధ్యేయంగా పెట్టుకున్న రాధ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కేవలం ప్రచారానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.పోటీ చేస్తే కేవలం ఒక్క నియోజకవర్గానికి దగ్గర ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం సాధ్యం కాదని అందుకే ప్రత్యక్ష ఎన్నికలకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.అయితే వరుసగా రెండు సార్లు పోటీకి దూరంగా ఉంటే వారి పొలిటికల్ ఫ్యామిలీ మరుగున పడుతుందేమోనని వంగవీటి అభిమానుల ఆవేదన.

మరింత సమాచారం తెలుసుకోండి: