
అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లోని బెజవాడలో ఉగ్రవాద కదలికలు జరుగుతున్నాయనే విషయం వైరల్ గా మారడంతో చాలామంది ఏపీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే గడిచిన రెండు నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు ఈ సమాచారం అందినట్లు తెలుస్తోంది. కేంద్ర నిఘా సంస్థ నలుగురు అనుమానితుల గురించి కూడా విచారించినట్లు సమాచారం. వీటితో పాటుగా మరొక 6 మంది అనుమానితులను కూడా స్థానిక పోలీసులు గుర్తించామని తెలియజేస్తున్నారు.
మొత్తం మీద 10మంది కదలికల పైన పోలీసులు ప్రత్యేకమైన నిగా ఉంచారన్నట్లుగా తెలుస్తోంది.ఈ 10 మంది కూడా గొల్లపూడి, లబ్బీపేట, అశోక్ నగర్ వంటి ప్రాంతాలలో వేరువేరుగా పనులు చేస్తున్నట్లుగా గుర్తించారట. అయితే ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు చేయడం లేదని మీకు వర్గాలు కొనసాగిస్తున్నట్లు తెలియజేస్తున్నా ఈ గతంలో కూడా మావోయిస్టులకి అడ్డాగా బెజవాడ నిలవడంతో ఇప్పుడు ప్రత్యేకమైన నిఘా సైతం ఏపీ పోలీసులు ఊహించినట్లు తెలుస్తోంది. అయితే మొత్తానికి పోలీసులు సైతం ఈ విషయం చెప్పడంతో అటు ఏపీ ప్రజలు కూడా కొంతమేరకు ఊపిరి పీల్చుకుంటున్నారు.