
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రైతులకు నీరు అందకపోగా, వారి భూములను కోల్పోయేలా చేశారని శ్రీధర్ బాబు విమర్శించారు. ఈ ప్రాజెక్టు లోపాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, తప్పు చేసినవారు శిక్ష తప్పరని ఆయన ఉద్ఘాటించారు. అధికారమున్నప్పుడు పోలీసులను దుర్వినియోగం చేసి, కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్‌లు, అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల హక్కుల కోసం నిలబడిన తమకు న్యాయం దక్కిందని, ఈ విజయం ప్రజలది, రైతులది అని పేర్కొన్నారు.
న్యాయస్థానాలపై, రాజ్యాంగంపై తమకు పూర్తి నమ్మకం ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. అక్రమ ఆరోపణలతో పెట్టిన కేసులు నిలవవని తాము ఎప్పటి నుంచో విశ్వసించామని, ఈ రోజు న్యాయం గెలిచిందని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గంలో కాలేశ్వరం భూనిర్వాసితుల పక్షాన నిలిచినందుకు, ఎనిమిది సంవత్సరాలు కోర్టు విచారణలను ఎదుర్కొన్నందుకు రైతులు, కాంగ్రెస్ నాయకులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి, హైదరాబాద్ న్యాయవాదుల సహకారాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు