చాలామంది విద్యార్థులు అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగం చేసుకోవాలని చాలా కలలతో వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అక్కడ అలా లేవని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలంటు పలువురు ఎన్నారైలు తెలియజేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొని చదువుకోవాలనే ఆలోచన ఉన్నవారు వాటిని విరమించుకోవాలంటు హెచ్చరిస్తున్నారు. టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఆర్థిక స్థోమత ఉంటేనే అమెరికా చదువుల కోసం రావడం మంచిది అంటూ తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చాక స్థానిక చట్టాలు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అని కూడా తెలుపుతున్నారు.


ఇప్పటికైతే ఉద్యోగులకు అనువైన వాతావరణం కనిపించలేదని..HB -1B వీసా, గ్రీన్ కార్డు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని మరి భారతదేశంలో  ఉండేటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలని సూచిస్తున్నారట. కొంతమంది చదువుల కోసం జర్మనీ, ఆస్ట్రేలియా  వంటి దేశాలకు వెళుతున్నారని అక్కడ మెరుగైన పరిస్థితులు ఉన్నాయని కొంతమంది తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో మాత్రం అమెరికాకు పార్ట్ టైం జాబ్ తో చదవాలని ఉద్దేశంతో ఉన్నవారు రాకపోవడమే మంచిది అట్టు సూచిస్తున్నారు.



అక్కడ జరుగుతున్న కొన్ని పరిస్థితులను అద్దం పట్టేలా చాలా పూర్తి వివరణతో తెలియజేస్తున్నారు. అయితే ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి పిలుపులో భాగంగా కొంతమంది ఎన్నారైలు ఈ విషయాలను తెలియజేశారట.

స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ.. మంచి అకాడమీ, యూనివర్సిటీ పైన పూర్తిగా రీఛార్జ్ చేసిన తర్వాతే మీరు ఇక్కడికి రండి. పార్ట్ టైం జాబ్ గురించి అసలు ఆలోచించకండి సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా వివాదాల జోలికి వెళ్ళకూడదు. కేవలం ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ఆర్థికంగా అంటూ తెలిపింది.


 తగినంత అనుభవం లేకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మాత్రమే ఇక్కడికి రావద్దు చాలామంది విద్యార్థులు ఉద్యోగాల కోసం చూస్తున్నారు అంటే అక్కడ ప్రొఫెసర్ శ్రీనివాస్ కూడా తెలుపుతున్నారు.


అయితే ఒకప్పుడు అమెరికాకు రావడం అక్కడ పార్ట్ టైం జాబు చేస్తూ ఉండడం అది ఫుల్ టైం జాబ్ గా మారి జీవితం సెట్ అయ్యేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. AI టూల్స్ కోడ్ అన్నిటిని సమకూరుస్తూ ఉన్నాయి  అంటూ తెలిపారు వేణు.


కెరియర్లో ఎదగాలి అంటే కేవలం సంకల్పం ఒకటే సరిపోదు అందుకు తగ్గట్టుగా డాక్యుమెంట్లు , డబ్బులను కూడా దాచుకోవాలి అంటే మరొక ఎన్నారై తెలియజేస్తున్నారు.


ఒకవేళ క్యాంపస్ లో చదువుకుంటూ బయట పార్ట్ టైం జాబ్ చేయడం కూడా ఇక్కడ నేరమని తెలుపుతున్నారు శైలేంద్ర.

ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్నవారు ఇక్కడ కచ్చితంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక్కడ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే.


ఉద్యోగాల కోసం చాలా పోటీ తీవ్రతగా ఉందని.. అమెరికాలో ఉద్యోగం కోసం వచ్చిన ఏ క్షణంలోనైనా లే ఆఫ్ కు గురి కావచ్చు.. అందుకే 60 రోజులలోపు ఉద్యోగం సాధించాలని లేకపోతే ఆ దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని తెలుపుతున్నారు తులసి

మరింత సమాచారం తెలుసుకోండి: