
తాడేపల్లి పార్క్ విల్లా లో దాదాపు 45 నిమిషాల పాటు ఈ ఇద్దరు సమావేశమయ్యారు. ఈ సమావేశం అయిన తర్వాత.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పై... విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని తాజాగా వైసిపి పార్టీ... బయటపెట్టి... జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి వెన్నుపోటు పొడిచినట్లు.. స్పష్టం చేసింది వైసిపి పార్టీ. టిడి జనార్ధన్... తో సమావేశమై జగన్మోహన్ రెడ్డి పై విజయ సాయి రెడ్డి కుట్రలు చేశాడని ఫైర్ అయింది. దీనికి తగ్గట్టుగానే మొన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. చంద్రబాబుతో లాలూచీపడి తన రాజ్యసభ సీటును అమ్ముకున్నాడని విజయసాయిరెడ్డి పై విమర్శలు చేశాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు