
ఈ దాడి పై మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ తెలియజేశారు మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని రాష్ట్రంలో దళితులు, బీసీలు ,మైనార్టీలు, ఎస్టీలు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సైతం పోలీసుల కాలరాస్తున్నారు అంటు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల ఇలాంటి పనులు చేయడం సరైనది కాదని వారికి ఇలా చేసే హక్కు కూడా లేదని ఇది మానవ హక్కుల పైన దాడి అంటూ జగన్ ఫైర్ అవుతూ మాట్లాడారు.
ఈ ఘటనలో పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని మరి యువకులను అంత దుర్మార్గంగా కొడుతున్నారని ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేసినట్టుగా కనిపిస్తోంది అంటు విమర్శించడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల పట్ల ఇలా కఠినమైన తీరుతో వ్యవహరిస్తోందని పోలీసులు కూడా ఈ విధంగా నడుచుకోవడం సరైనది కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటన పైన చర్యలు తీసుకోవాలని.. అందులో బాధ్యులైన పోలీసులకు కూడా కఠినంగా శిక్షించాలంటూ మాజీ సీఎం జగన్ సీఎం చంద్రబాబుని డిమాండ్ చేయడం జరుగుతోంది.
గంజాయి మత్తులో కానిస్టేబుల్ ను కొట్టారంటూ ఈనెల 27న చిరంజీవి అనే కానిస్టేబుల్ ఆరోపణలు చేయడంతో జాన్ విక్టర్, బాబు లాల్, రాకేష్ అని ముగ్గురు యువకులను అరెస్టు చేయడమే కాకుండా వారి పైన రౌడీషీటర్లుగా ఉన్నారని పోలీసులు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే టూ టౌన్ సిఐ రాములు నాయక్ , త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు వీరిని నడిరోడ్డు మీదే అరికాళ్ళ పైన లాఠీలతో కొట్టిన ఘటన వైరల్ గా మారింది. ఈ విషయం పైన చాలామంది స్పందిస్తున్నారు.