తెలంగాణలో ఎదురులేని నాయకుడిగా కేసీఆర్ ఎదిగారు. బీఆర్ఎస్ పార్టీలో ఆయన మాట అన్నాడంటే శాసనం చేసినట్టే. అలాంటి కేసీఆర్  రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాడు. అంతటి ధీరుడికి తన సొంత కూతురే కుంపటి పెట్టింది. సొంత పార్టీలో విభేదాలు రావడంతో ఆమె మరో పార్టీ పెట్టడానికి సిద్ధమైందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని తాజాగా  ఒక పెద్ద వార్త సంచలనమైంది. బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్  లోకి ఆమె రావడానికి సిద్ధమైందని అంతేకాదు కాంగ్రెస్ లో ఒక మంత్రి పదవి కూడా కావాలని అడిగినట్లు ఓ వార్త సంచలనమైంది. అయితే దీనిపై రేవంత్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

అయితే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇతర నాయకులంతా అస్సలు ఒప్పుకోవడం లేదట. దీనికి కారణం ఉద్యమ పార్టీ నుంచి ఆమె ఇందులోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని ఆ పార్టీ సెంటిమెంటును విడదీసినట్టు అవుతుంది. ఆ అపవాద కాంగ్రెస్ పై పడేసుకోవడం ఎందుకని ప్రశ్నించారట. ఇలా కవిత రాకను కాంగ్రెస్ అధిష్టానం రిజర్వ్డ్ లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కట్ చేస్తే కవిత నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత చూపిస్తుందా? లేదంటే కాంగ్రెస్ ను అంతం చేయడానికి కేసీఆర్ వేసిన ప్లాన్ లో భాగంగా కవిత ఇలా ప్రవర్తిస్తుందా అనేది కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇదే తరుణంలో కాంగ్రెస్ ను విచ్చినం చేయాలి అంటే కవిత లాంటి నాయకురాలు అందులోకి వెళ్లాలి.

 దీనివల్ల పార్టీలో మిగతా ఎమ్మెల్యేలకు, మంత్రి పదవి ఆశిస్తున్న వారికి మధ్య గొడవ జరుగుతుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ విచ్చిన్నమైపోయి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు వస్తాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి కూడా కేసీఆర్ ఈ ప్లాన్ చేసి కవితను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారా అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు  అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కవిత టీ కాంగ్రెసులో చేరితే మాత్రం తప్పకుండా  పార్టీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి కవిత పూర్తిస్థాయిలో కాంగ్రెస్ లో చేరుతుందా లేదంటే ఎలక్షన్స్ వరకు పార్టీ పెట్టి తానే సొంతంగా నిలబడుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: