
2024 ఎన్నికలలో జనసేన పార్టీ రాజకీయాలు బాగా కలిసొచ్చాయని తెలుస్తోంది. ఒక సర్వే సంస్థ జనసేన ఎమ్మెల్యేల పనితీరు పైన అని నియోజకవర్గాలలో ఆరా తీసినట్లుగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో చాలామంది ఎమ్మెల్యేల పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లుగా సర్వేలో తేలిందట. వీటన్నిటిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కూడా అందజేసినట్లు సమాచారం.గడిచిన ఏడాది క్రితం ఎన్నికలలో కూటమిలో 100% స్ట్రైక్ రేట్ అంటూ జనసేన పార్టీ గొప్పగా చాటింపు చేసుకుంది. ఇప్పుడు అందులో సగభాగం కూడా పనిచేయలేదని సర్వేలు తెలియజేస్తున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తూ ఉండడంతో అందుకు పూర్తిగా విరుద్ధంగా ఫలితాలను ఇప్పుడు సర్వేలు సూచిస్తున్నట్లు కనిపిస్తున్నాయట. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల పైన పలు రకాల ఆరోపణలు ఉన్నాయంటూ సర్వేలు చెబుతున్నాయట.. ముఖ్యంగా లిక్కర్ ,అవినీతి ,ఇసుక మాఫియా, ల్యాండ్ కబ్జాలు, గొడవలు వల్ల చాలామంది ఎమ్మెల్యేల పైన విమర్శలు ఎదుర్కొంటున్నారట. ఈ సర్వే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెంతకు చేరడంతో సపరేటుగా ఎమ్మెల్యేలతో మంత్రులతో మాట్లాడాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. జూన్ 12 తర్వాత విజయోత్సవ ర్యాలీ పూర్తి చేసుకుని ఎమ్మెల్యేలతో ముఖాముఖిగా భేటీ అవ్వాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏమి చేయలేదని విమర్శలు ఎదుర్కొంటోంది. మరి ఇలాంటి సమయంలో మంత్రుల పైన కూడా ఇలాంటి ఆరోపణలు వినిపించడంతో పరిస్థితి ఏంటా అని జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.