గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ప్రజలు తనకు కావాలని వెన్నుపోటు పొడిచారని .. వెన్నుపోటు దినోత్సవం జరపాలని జగన్ రెడ్డి ప్రకటించారు .. అలాగే ఆయన పార్టీ నేతలు అందుకు రెడీ అవుతున్నారు .  దీనికి ఎంత మంది వస్తారో ఎలా చేస్తారో కానీ .. జగన్ రెడ్డి వెన్నుపోటుకు కూటమి పార్టీలు రివర్స్ కౌంటర్ రెడీ చేశాయి .  ఇక 4 తేదీన జగన్ నుంచి విముక్తి కి ఏడాది ,  పీడ విరగడం అయి ఏడాది పేరు తో టిడిపి , జనసేన క్యాడర్ వినూత్న‌ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి ..
 

అలాగే జగన్ రెడ్డి ఓడిపోయి సంవత్సరం అయినా గ‌త ఐదు సంవత్సరాల పాటు ఆయ‌న చేసిన పాలన నిర్వహాలు తలుచుకుంటే సామాన్య ప్రజలకు ఇంకా భయం భయంగానే ఉంటుంది .  చివరికి ఇందిరాగాంధీ హయాంలో ఇల్లు తెచ్చుకున్న పేదలను కూడా వదలకుండా వన్ టైం సెటిల్మెంట్ పేరుతో.   ఇళ్ల మీదకు వాలంటీర్లు ఇతరులను పంపించి డబ్బులు వసూలు చేశారు.   అలాగే మద్యం విధానాల తో లక్షల మంది ప్రాణాలను చావు అంచుల వరకు తీసుకువెళ్లారు .   అలాంటి పాలన మరోసారి వద్దు దేవుడా అంటూ జగన్ ను త‌లుచుకుని ఉలిక్కిపడుతున్నారు ..



ఓ సంవత్సరం తర్వాత కూడా ఆ షాకు లు మర్చిపోలేనంతగా  ప్రజలు గుండెల్లో గుచ్చుకుపోయాయి ..  అందుకే ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారని జగన్ భావిస్తున్నారు .. ప్రజలు ఇచ్చిన తీర్పును ఏమాత్రం గౌరవించని జగన్ పై .. కూటమి పార్టీలు అదేవిధంగా అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్ లు ఇస్తున్నాయి .  అలాగే జగన్ పీడ విరగడ అయి  ఏడాది అయిందని సంబరాలు జరుపుతుంది .  రాజకీయాల్లో వ్యతిరేకత ఉంటుంది .. కానీ జగన్ రెడ్డి తాను చేసిన శత్రుత్వ రాజకీయాలు ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగిస్తూ .  ప్రతిపక్షాలు ఇతరులంతా అసహ్యించుకునేలా అయ‌న‌ ప్రవర్తన ఇప్పటికీ అలాగే ఉంటుంది ..

మరింత సమాచారం తెలుసుకోండి: