మన జీవితంలో ప్రతి ఒక్కరు రోజు ఒక గంటపాటు యోగా చేస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి , ఇక ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అందరికీ రోల్ మోడల్ గా నిలుస్తున్నారని .. ఆంధ్రప్రదేశ్ బీసీ ఈడబ్ల్యూఎస్ , సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ స‌విత చెప్పుకొచ్చారు .. ఎన్ని పనులు ఎంతవరకు ఉన్నా సరే 70 ఏళ్ళ వ‌య‌సులో కూడా చంద్రబాబు ప్రతిరోజు ఉదయం గంట పాటు యోగా చేస్తారంటూ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే యోగాతో శారీరిక , మానసిక దృఢత్వం సాధిస్తామని తద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుందని .. ఇదే చంద్రబాబు విజయ రహస్యమని ఆమె చెప్పకు వచ్చారు ..
 

యోగాంధ్ర‌ 2025 మాస ఉత్స‌వాల‌ల్లో భాగంగా పెనుగొండలోని కియా పరిశ్రమ వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మంత్రి స‌విత ప్రాచీన భారతదేశం అందించిన ఎంతో అమూల్యమైన గొప్ప బహుమతి యోగా అని చెప్పుకొచ్చారు. యోగ కారణంగా ఎంతో స్థిరమైన ఆరోగ్యం సాధిస్తామని ప్రస్తుతం సమాజంలో తీవ్ర ఒత్తిడి మధ్య జీవనం సాగుతుందని .. ఇలాంటి సమయంలో మానసికంగా దూరంగా ఉండాలంటే యోగ చేయాలని అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలమని ఆమె చెప్పకు వచ్చారు .. అలాగే యోగతో చంద్రబాబు ఈ వయసులో కూడా పాతికేళ్ల యువకుడి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారని చెప్పకు వచ్చారు .



ఆరోగ్యంగా ఏకాగ్రతతో  , విజ‌న‌రీ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని కూడా చెప్పక వచ్చారు. అలాగే సీఎం చంద్రబాబును అందరూ రోల్ మోడల్ గా తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు .. ఇక ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో నిర్వహించడానికి సీఎం చంద్రబాబు అన్ని రకాల చర్యలు తీసుకున్నారని కూడా మంత్రి స‌విత వెల్లడించారు .. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగా నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పారు.  విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఐదు లక్షల మందితో యోగా నిర్వహించబోతున్నామ‌ని .. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్న బోతున్నారని సవిత చెప్పకు వచ్చారు .. ఈ గొప్ప కార్యక్రమంలో ప్రజల పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా ఆమె పిలుపునిచ్చారు .

మరింత సమాచారం తెలుసుకోండి: