
విశాఖలో ఈ నెల 21న కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న యోగాంధ్ర కార్యక్రమం సన్నద్ధతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో విశాఖ నోవాటెల్ హోటల్ లో జరిగిన సమీక్షలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖలో నిర్వహించే 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కు ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరు కానుండటంతో కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. యోగా దినోత్సవ ఏర్పాట్లు, సన్నద్ధతపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కార్యక్రమం కావడం తో ఏ చిన్న ఇబ్బంది కూడా రాకుండా చాలా పక్కా ప్రణాళికతో ఉండాలని కూడా లోకేష్ తెలిపారు. ఇక విద్యార్థుల విషయం లో తగిన జాగ్రతలు తీసుకోవాలని, ప్రతి 20 మంది విద్యార్థుల కు సంరక్షకుడిని నియమించాలని సూచించారు. బస్సుల కండిషన్ ను ముందుగానే పరీక్షించాలన్నారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం లో పలువురు ఎంపీలు , మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు