కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక స్కామ్ లో వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ,తిరుపతి లడ్డు కల్తీ, అక్రమ రేషన్ , భూకబ్జాలు అంటూ ఎన్నో వాటిలో వైసీపీ నేతలను అరెస్టు చేస్తూ ఉన్నారు. అయితే వీటిని వారు అక్రమ అరెస్టు అంటూ వాదిస్తూ ఉన్నారు. తాజాగా వైసిపి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇటీవలే బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈయన కుమారుడు మోహిత్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ లో తమ పేర్లను తీసుకురావడంపై ఒక లేఖ ద్వారం తెలిపారు.



మోహిత్ రెడ్డి కొన్ని ప్రశ్నలు వేశారు.. సిట్ విచారణలో భాగంగా సత్యమేవ జయతే అంటూ దీనిమీద డీజీపీ విచారణకైనా సిద్ధం అన్నటువంటిది ప్రకటిస్తూ.. మోహిత్ రెడ్డి ఒక బహిరంగంగా ప్రశ్నావళిని సంధించారు.. నిబద్ధత నిజాయితీ పారదర్శకత అంటూ లేఖ రాసిన అధికారులు నా ఈ కింది ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారట.. ఒక ఏడాదికాలంగా విచారణ చేపడుతున్న సిట్ అధికారులు ఈ 365 రోజులలో ఏ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, రాజా కసిరెడ్డి నుంచి డబ్బులు అందాయి దాన్ని ప్రజలకు పంచారని ఏనాడు ప్రస్తావించకుండా.. ఈరోజు చెప్పడంలో ఎలాంటి అర్థం ఉంది అంటూ మోహిత్ రెడ్డి ప్రశ్నించారు. అది నిజం కాదు కనుక ఇప్పుడు చెప్పారంటూ ప్రశ్నించారు.




ఇంకో 20 సంవత్సరాల సర్వీసు ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగా పెట్టి మరి.. ఒక పోలీసుగా ఉండి పోలీస్ అధికారి పైన ఎవరైనా అబద్ధాలు చెప్పగలరా.. ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తమకు జరిగిన అన్యాయం పైన జరిగిన వాటికి లేఖ ద్వారా డిజిపి గారిని ప్రాధేయపడితే..అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం.. సిట్ కార్యాలయ అధికారులు దిగజారుడు తననికి నిదర్శనం అంటూ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పదేళ్లుగా గన్మెన్ గా పనిచేసిన మదన్ రెడ్డి సిట్ కార్యాలయానికి పిలిపించి మరి విచారణ చేసే సమయంలో అతను చెప్పినట్లుగా స్టేట్మెంట్ రాయకుండా సిట్ అధికారులు చెప్పినట్టుగా చెప్పాలని ఒత్తిడి చేయడం తప్పే కదా.. అలా హింసించడం వల్లే కదా అతను చనిపోతానని చెప్పి.. మీ అందరి పేర్లు రాసి చనిపోతాను అంటూ చెప్పిన హెడ్ కానిస్టేబుల్ ను సిట్ అధికారులు శారీరకంగా ,మానేసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అంటారో ఆలోచించాలి అంటూ తెలిపారు.


కుట్రలు కుతంత్రాలు పడుతోంది మీరే కదా.. అది మీ మనస్సాక్షినే అడగండి చెబుతుంది.. సిట్ కార్యాలయంలో పార్యదర్శకంగానే విచారణ జరుగుతోందని చెబుతున్నారు.. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదని చెబుతున్నారు .. ఏ ఒక్క అధికారి అయినా భగవంతుడు ముందు ప్రమాణం చేసి చెబుతారా.. మీరు రాయమన్నట్టుగా రాసి చెప్పమన్నట్టుగా చెప్పిన గిరి అనే కానిస్టేబుల్ కి ఆగవేగాల మీద 60% జీతం పెంచుతూ ఆక్టోపస్ లో ప్రమోషన్స్ కల్పించారు.సిట్ విచారణ ఎంత పారదర్శకంగా జరుగుతోందో అర్థమవుతోందని.. అన్నిటికీ ఏదో ఒక రోజు సమాధానం దొరుకుతుంది.. తప్పు చేసిన సిట్ అధికారులందరికీ కూడా సత్యమేవ జయతే అంటూ న్యాయస్థానం, దేవుడు శిక్ష విధిస్తాయి.. ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి అప్పుడే సత్యం గెలుస్తుంది ,ధర్మం గెలుస్తుందని చెప్పారు మోహిత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: