
ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని ఆమె అన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని షర్మిల చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడికి రమ్మన్నా వస్తానని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని ఆమె చెప్పుకొచ్చారు.
ఆనాడు జగన్, కెసిఆర్ మధ్య ఉన్న అనుబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది ఆమె పేర్కొన్నారు. తెలంగాణాలో నన్ను రాజకీయంగా ఆర్థికంగా తొక్కేయడానికి కెసిఆర్, జగన్ కలిసి స్కెచ్ వేశారని షర్మిల అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిస్తే మీరేం చేశారని నన్ను అడగొచ్చని అప్పటి పరిస్థితులు వేరని ఆమె అన్నారు. జగన్, కెసిఆర్ చేసిన అరాచకాలతో పోల్చి చూస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నదని ఆమె పేర్కొన్నారు.
నేను జగన్ కు సొంత చెల్లెలు అయినప్పటికీ నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేశారని షర్మిల చెప్పుకొచ్చారు. నాకు మద్దతు పలికిన వాళ్ళను బెదిరించారని ఆమె వెల్లడించారు. పొలిటికల్ గా నా వాళ్ళు రానివ్వకుండా చేసారని ఆమె తెలిపారు. నేను తెలంగాణాలో పార్టీ పెట్టడంలో జగన్ కు సంబంధం లేదని కెసిఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశారని షర్మిల కామెంట్లు చేశారు. షర్మిల కామెంట్లపై వైవీ సుబ్బారెడ్డి రియాక్ట్ అవుతారేమో చూడాలి.