
ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది ప్రతిపక్షంలోకి వచ్చిన వైసీపీ పలు నియోజకవర్గాల్లో కష్టాలు ఎదుర్కొంటుంది. పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పార్టీని వీడి వెళ్లడంతో చాలా నియోజకవర్గాలలో ఆ పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేని పరిస్థితి. మరీ ముఖ్యంగా కీలకమైన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ...ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసిపి పార్టీని ముందు నడిపించే నాయకుడు లేక ఎన్నికలు పూర్తయిన ఏడాదికే చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికలలో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరు దాటి బయటకు రావడం లేదు. విజయవాడ ఎంపీగా ఓడిపోయిన కేశినేని నాని రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. మచిలీపట్నంలో వైసీపీ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలసౌరి ఎన్నికలకు ముందు జనసేనలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు.
గుంటూరులో ఓడిపోయిన కిలారు వెంకట రోశయ్య సైతం పార్టీకి రాజనామా చేసి బయటికి వచ్చేసారు. ఇక బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ పార్టీలో ఉన్నా ఆయన చుట్టూ కేసులు ఉండడంతో రాజకీయంగా బయటికి రాలేని పరిస్థితి. తన బలమైన వాయిస్ వినిపించడమే పరిస్థితి. మాజీ మంత్రులు యాక్టివ్‌గా లేరు. ఇక ఎమ్మెల్సీలుగా ఉన్నవారు ఈ టైంలో అధికార పక్షంపై పోరాటం చేసి ప్రజల తరఫున వాయిస్ వినిపించకుండా పార్టీలు మారిపోతున్నారు. ఓవరాల్‌గా రాజధాని జిల్లాలుగా ఉన్న ఉమ్మడి కృష్ణ - ఉమ్మడి గుంటూరు జిల్లాలలో వైసీపీ పూర్తిగా చేతులు ఎత్తేసింది అని చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణలు అవసరం లేదు. ఓవైపు కొన్ని ప్రాంతాలలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది అని సర్వేలు చెబుతున్న ఈ రెండు జిల్లాలలో వైసిపి పెద్దగా పుంజుకోలేదని వైసిపి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి జగన్ రాజధాని జిల్లాలపై ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేసి పార్టీలో జోష్ తెస్తారో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు