
"కేసిఆర్ సారు .. మహిళలను లైంగికంగా వేధిస్తున్న మీ వాళ్లను పార్టీల నుంచి వెంటనే సస్పెండ్ చేయండి. అలాగే మానవ అక్రమ రవాణాలోనూ బీఆర్ఎస్ నేతలే నిందితులుగా ఉన్నారు. అరాచకాలను ఆపి మహిళలకు రక్షణ కల్పించండి సారు" అంటూ తెలంగాణ భవన్ సమీపంలో ఆరిజన్ డెయిరీ యాజమాన్యం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.
.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చిన్నటోడు కాదు అని గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయ్. ఆయన కామపిశాచి అంటూ తెలంగాణ భవన్ సమీపంలో ఫ్లేక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు తెలంగాణ పాలిటుక్స్ లో పెద్ద ఇష్యూ గా మారింది. అసలే అంతంత మాత్రం ఉన్న బీఅర్ ఎస్ పరిస్ధితి ఇప్పుడు పూతిగా దిగజారిపోయిన్నట్లైంది.బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజల గురించి ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు .
మరి ముఖ్యంగా డైరెక్ట్ గా కేసీఆర్ కి రిక్వెస్ట్ చేస్తూ "కేసీఆర్ సారు ఇలాంటి వ్యక్తిని వెంటనే మీ పార్టీలోంచి సస్పెండ్ చేయండి అని .. గిరిజన మహిళలను వేధిస్తున్న ఇలాంటి వాళ్లు మీ పార్టీలో ఎలా పెట్టుకుంటారా..? అని నిలదీయడం హైలెట్ గా మారింది". అంతేకాదు మానవ అక్రమ రవాణాలోను బీఆర్ఎస్ నేతలే ఎక్కువుగా ఉన్నారు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ అరాచకాలు ఆపి మహిళలకు రక్షణ కల్పించాలి అని డైరెక్ట్ గా మాజీ సీఎం కేసీఆర్ ని ప్రజలు కోరడం ఇప్పుడు పెద్ద ఇష్యూ గా మారిపోయింది.
అంతేకాదు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గత తాలూకా పాత జ్ఞాపకాలను కూడా కొందరు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీని ఆధారంగా పెట్టుకొని నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దుర్గం చిన్నయ్య పేరు గబ్బు లేపుతుంది, ఈ మధ్యకాలంలో చాలా మంది పొలిటికల్ నేతలు ఇలా అమ్మాయిలను ఏడిపిస్తూ మహిళలను లైంగికంగా వేధిస్తున్న కేసుల్లో ఇరుక్కుంటున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాం . ఇలాంటి మూమెంట్లోనే మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కూడా ఇలాంటి ఒక ఆరోపణ రావడం పెద్ద సెన్సేషన్ గా మారిపోయింది..!