
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి 25 ఎంపీలకు సంబంధించి వీరు ప్రజలకు చేరువైన తీరు, ప్రజా సమస్యల పైన పరిష్కరించిన తీరు గురించి, నియోజకవర్గాలలో అందుబాటులో ఉంటున్నారా లేదా అనే కోణాలలో సర్వేలు జరిపారట. ఈ క్రమంలోనే ఒక సంస్థ సర్వేలో 25 మందికి గాను పదవ స్థానంలో పురందేశ్వరి చోటు దక్కించుకుందని తెలుపగా కానీ మరొక సంస్థ మాత్రం ఇలాంటి సర్వేలో పురందేశ్వరి 12 వ స్థానంలో ఉందంటూ వెల్లడించారు. దీంతో ఈమె పనితీరు పుంజుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.
కానీ పురందేశ్వరి వెనుకబడడానికి కారణాలు ఇవే అంటూ సర్వే సంస్థలు కూడా వెల్లడించాయి. ముఖ్యంగా ప్రజలకు ఆమె దూరంగా ఉండడమే పెద్ద సమస్యగా మారిందట. తాను చేయవలసిన పనులను వదిలేసి అంతా కూడా ఏపీ ప్రభుత్వం చూసుకుంటుందనే ధోరణిలో వ్యవహరిస్తున్న తీరు మరింత సమస్యగా ఉన్నదట. అయితే ఎన్నికల ముందు తాను క్షేత్రస్థాయిలో ఉంటానని సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాను అంటూ ఎన్నికల ముందు చెప్పిన కానీ గెలిచిన తర్వాత మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. రాజమండ్రి ప్రజలు కూడా ఆమెను చూసి చాలా కాలం అవుతుందంటూ వెల్లడిస్తున్నారట. ఏపీ బీజేపీ పార్టీకి సంబంధించి చీఫ్ గా ఉన్న పురందేశ్వరి బిజీగా ఉన్నప్పటికీ తనని గెలిపించిన ప్రజలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది.. కూటమిలో భాగంగా బిజెపి ఉండడంతో అంత ఏపీ ప్రభుత్వం చూసుకుంటుందనే భావనతో ఉన్నట్లు తెలిపారు. అయితే సర్వేలు మాత్రం పురందేశ్వరి చాలా వెనకబడి ఉందని ఆ తీరని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ తెలుపుతున్నారు.