
అలాగే మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ఇందులో ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది .. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన గణాంకాలను చూస్తుంటే ఇదే విషయం క్లారిటీగా అర్థమవుతుంది .. ఆదాయ సమానత్వంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది .. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పీఎం జన్ ధన్ యోజన, డీబీటీలు, ఆయుష్మాన్ భారత్, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన వంటి సంక్షేమ పథకాలు ఆదాయ అసమానతలు తగ్గించడంలో ఎంతగానో సహాయపడినట్టు తెలుస్తుంది. అలాగే ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం .. భారత్ 25.5 గిని ఇండెక్స్ తో నాలుగో ప్లేస్ లో నిలిచింది .. అలాగే మన దేశం కంటే ముందు సోవాక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ వంటి దేశాలు ఉన్నాయి .. అలాగే చైనా 35.7 పాయింట్లతో 65వ స్థానంలో ఉంటే .. అమెరికా 41.8 పాయింట్లతో 90వ ప్లేస్ లో నిలిచింది ..
ఇలా ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 దేశాలు మాత్రమే మద్యస్థంగా తక్కువ ఆదాయ అసమానతలు ఉన్న గ్రూపులో ఉన్నాయి .. ఇక వీటిలో ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, పోలాండ్ వంటి దేశాలు ఉన్నాయి . అలాగే మనదేశంలో కుటుంబాల మధ్య ఆదాయం, సంపద వినియోగం ఎలా పంపిణీ జరుగుతుందో గిన్ని ఇండెక్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు .. గిన్ని ఇండెక్స్ విలువ సున్నా నుంచి 100 వరకు ఉంటుంది . ఇక్కడ 0 స్కోరు అంటే సంపూర్ణ సమానత్వం ఉన్నట్లు .. అలాగే 100 ఉంటే అత్యధిక ఆదాయ అసమానతలతో ఉన్న దేశంగా కనిపిస్తుంది .. అలాగే గిన్ని ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశంలో ఆదాయ అసమానతలు అంత ఎక్కువగా ఉన్నట్లు కూడా అర్థం ..